News

పండంటి మగబిడ్డను ప్రసవించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఏం పేరు పెట్టారంటే..?

అమలా పాల్ 2009లో నీలతామర అనే మలయాలం సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మలయాళంతో పాటు తమిళంలోనూ చిత్రాలు చేశారు. 2011లో బెజవాడ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మూడు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. చాలా సూపర్ హిట్‍లను సాధించారు. ఇప్పటికీ వరుస చిత్రాలతో అమల బిజీగా ఉంటున్నారు. అయితే గతేడాది తన ప్రియుడు గుజరాత్ కు చెందిన జగత్ దేశాయ్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది అమలా పాల్.

కొన్నినెలల క్రితం తమ జీవితంలో మరో కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోందీ ముద్దుగుమ్మ. ఇటీవల సీమంతం వేడుకలను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో కూడా తెగ వైరలయ్యాయి. ఇప్పుడు అమ్మవడంతో అమలా పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదే సందర్భంగా తమ కుమారుడి పేరును కూడా అమలాపాల్ వెల్లడిండించి.

కుమారుడికి ఇలాయ్ (ILAI) అని పేరు పెట్టినట్టు సోషల్ మీడియాలో తెలిపింది. “ఇట్స్ బేబీ బాయ్. మా చిన్ని అద్భుతాన్ని చూసేయండి. 11.06.2024న జన్మించాడు’ అని వీడియో పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక అమ్మయిన ఆనందంలో తన కుమారుడిని చేతుల్లో ఎత్తుకొని ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టింది అమలా పాల్. అప్పటికే కుటుంబ సభ్యులు ఇంటిని అందంగా ముస్తాబు చేశారు. తన గదికి వెళ్లిన అమల సర్‌ప్రైజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులు, నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. అమలా పాల్ చివరిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం సినిమాలో కనిపించింది. మార్చి 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె లెవెల్ క్రాస్ తో సహా మరో మలయాళం సినిమాలో కూడా నటిస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker