News

జబర్దస్త్ లోకి రాక ముందు అనసూయ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?

అన‌సూయ ఇంట‌ర్ సెకండియ‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు ఎన్‌సీసీ క్యాంప్‌ లో సుశాంక్ భ‌ర‌ద్వాజ్ ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని ప్ర‌పోజ్ చేసాడు, కానీ అప్పుడు అంగీకారం తెలుపని ఆమె ఏడాదిన్న‌ర త‌ర్వాత మ‌ళ్లీ ఎన్‌సీసీ క్యాంప్‌లో భ‌ర‌ద్వాజ్‌తో స్నేహం కాస్త ప్రేమగా మరి తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకున్న తరువాత పెద్దల అంగీకారంతో ఆమెకు 2010లో సుశాంక్ భరధ్వాజ్ తో వివాహమయింది.

వారికి ఇద్దరు పిల్లలు. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్. అనసూయ ఎంబీఏ చదివారు. ఆమె గోల్ మాత్రం నటి కావడం. చదువుకునే రోజుల్లోనే నటిగా ప్రయత్నాలు చేశారు. 2003లో ఎన్టీఆర్ హీరోగా నాగ టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ విడుదలైంది. ఈ చిత్రంలో అనసూయ జూనియర్ ఆర్టిస్ట్ గా చేశారు.

కాలేజ్ స్టూడెంట్స్ గుంపులో ఒకరిగా నటించారు. చదువు పూర్తయ్యాక ఓ కార్పొరేట్ కంపెనీలో హెచ్ ఆర్ జాబ్ చేసింది. అనంతరం సాక్షి టీవీలో న్యూస్ రీడర్ గా కూడా చేసింది. 2013లో ప్రయోగాత్మకంగా తెలుగులో జబర్దస్త్ అనే కామెడీ షో స్టార్ట్ చేశారు. ఈ షో ఆడిషన్స్ కి హాజరైన అనసూయ ఎంపికయ్యారు. జబర్దస్త్ ఊహించని సక్సెస్ కావడంతో అనసూయకు ఫేమ్ దక్కింది . అనసూయ బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో పొట్టిబట్టలు వేసిన మొదటి యాంకర్ గా అనసూయను చెప్పుకోవాలి.

జబర్దస్త్ లో చేస్తూ మధ్యలో తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతో షో నుండి వెళ్లిపోయారు. దాంతో రష్మీ గౌతమ్ ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ కాగా ఎక్స్ట్రా జబర్దస్త్ అనే మరో షో స్టార్ట్ చేశారు. దాంతో అనసూయకు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కింది. అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచలంచెలుగా ఎదిగారు. ఆ షోతో వచ్చిన పాపులారిటీ ఆమెను నటి, ఆపై హీరోయిన్ చేసింది. అనసూయ ప్రస్తుతం బిజీ యాక్ట్రెస్. తెలుగుతో పాటు పలు భాషల్లో చిత్రాలు చేస్తుంది.

లీడ్ హీరోయిన్ గా కూడా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయ్యాక అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశారు. జబర్దస్త్ లోకి వచ్చే నాటికే అనసూయ వివాహం జరిగింది. సుశాంక్ భరద్వాజ్ తో అనసూయది ప్రేమ వివాహం. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. అనసూయ బోల్డ్నెస్, యాటిట్యూడ్ వివాదాస్పదం అవుతున్నాయి. కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండతో ఆమెకు కోల్డ్ వార్ నడుస్తోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker