రేవ్ పార్టీ పై సంచలన విషయాన్ని బయటపెట్టిన యాంకర్ శ్యామల, అసలు జరిగింది ఇదంటూ..?
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు నటీనటులకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఈ రేవ్ పార్టీలో తెలుగు నటీనటులు కొందరు ఉన్నారు అంటూ ప్రచారం ఇబ్బందుల్లో పడేస్తోంది. ముఖ్యంగా హేమ ముందు నుంచి హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అలాగే ఈ పార్టీలో నటి యాంకర్ శ్యామల కూడా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే రేవ్ పార్టీలో వందమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ హాజరయ్యారు అంటూ కన్నడ పోలీసులు విచారణలో బయటపడడం సంచలనంగా మారింది.
అంతేకాదు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇదే పార్టీలోఎంజాయ్ చేసినట్లు కన్నడ పోలీసులు కనిపెట్టేశారు. అంతేనా ఏపీకి చెందిన వైసిపి పార్టీ నేత కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు అంటూ వార్తలు వినిపించాయి . ఆయన కారు ఈ రేవ్ పార్టీలో సీజ్ చేయడం అందరికీ హాట్ టాపిక్ గా అనిపిస్తుంది . అంతేకాదు ఆయనతో పాటు ఈ రేవ్ పార్టీలో తెలుగు టాప్ యాంకర్ కూడా పాల్గొంది అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ యాంకర్ శ్యామలనే అంటూ పలువురు ఆమెపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే కొందరు హద్దులు మీరిన కామెంట్స్ కూడా చేశారు. వైసీపీ క్యాడర్ కి సంబంధించిన ఒక ఆడపిల్ల పై ఇలాంటి విష ప్రచారం చేయడానికి తప్పు పడుతున్నారు జనాలు. శ్యామలపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనాలు . తాజాగా ఈ విషయంపై శ్యామల కూడా స్పందించింది.” అసలు ఆ రేవు పార్టీ అంటే ఏంటి..? బెంగళూరులో ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది ..? ఎందుకు జరిగింది? అందులో ఎవరెవరు ఉన్నారు ..?
నాకు అసలు ఏమీ తెలియదు ..ఎందుకు నన్ను అనవసరంగా ఈ విషయం లోకి లాగుతున్నారు ..దుష్ప్రచారం చేసిన నా పేరుని చెడగొడుతున్నారు . ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు అంటే ఒక పార్టీతో అనుసంధానం అయి ఉన్నాను అని తెలిసి ఈ విధంగా నాపై దుష్ప్రచారం చేయడం న్యాయమేనా..? దయచేసి ఇలాంటివి నమ్మకండి అంటూ శ్యామల రిక్వెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!