రోజు రెండు అంజీర్ పళ్ళు తింటే మీ శరీరంలో జరిగే అద్భుతం ఇదే.
ఈ సీజన్‌లో మనకు అత్యధికంగా అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ముఖ్యంగా అంజీర పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిందని డైటీషియన్లు, వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు మొదలు.. వృద్ధుల వరకు అందరూ ఈ పండ్లను తినవచ్చు. ఇవి తినడం ద్వార అనేక రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఎంతోమంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.
అలాంటి వారు అంజీర పండ్లను రోజుకు ఒకటి, రెండు పండ్ల చొప్పున తిన్నా మంచి ఫలితం కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే చాలా మంది ప్రతి రోజూ పండ్లతోపాటు డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. అంజీరని కూడా చాలా మంది రోజు తీసుకుంటూ ఉంటారు. అంజీర పండ్లని తీసుకోవడం వలన చక్కటి లాభాలని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అంజీర పండ్లను తీసుకోవడం వలన చక్కటి లాభాలను పొందవచ్చు. అంజీర పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంజీర పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట వీటిని నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకుంటే మంచిది. అంజీర ముక్కల్ని రెండు నుండి నాలుగు తీసుకోవచ్చు. ఇప్పుడు వాటిని తీసుకుని ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి వాటిని రాత్రంతా నానబెట్టి, ఉదయం నీటిలో నుండి తీసేశాక పరగడుపున వీటిని తీసుకోవడం మంచిది.
అంజీర పండ్లను తినడం వలన మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. అంజీర పండు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంజీర పండ్లను తీసుకోవడం వలన క్యాల్షియం ఎక్కువగా అందుతుంది. ఎముకలకి అవసరమైన క్యాల్షియంని ఈ పండ్లతో పొందవచ్చు. అంజీర పండ్లలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఫైబర్ వీటిలో ఎక్కువ ఉంటుంది. నానబెట్టిన అంజీర పండ్లను తీసుకుంటే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది.
చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి వాటిని తీసుకునే బదులు, భోజనం తర్వాత అంజీర పండ్లని తీసుకోవచ్చు. డయాబెటిస్ తో బాధ పడే వాళ్ళు అంజీర పండ్లను తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చాలా తక్కువ సోడియం ఉంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలని మనం ఈ పండ్లని తీసుకొని పొందవచ్చు.