Health

ఖాళీ కడుపులో అంజీర్ వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..?

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి, అంజీరా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చాలా కాలం పాటు మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది, తద్వారా మీరు ఆకలితో బాధపడరు. పరిమిత మొత్తంలో కేలరీలను తీసుకుంటారు. ఇది కోరికలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీరా పండ్ల నీటిని తాగడం వల్ల మీ జీవక్రియను పెంచవచ్చు, ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే.

డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల ఎన్నో రకాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్‌లో అంజీర్ కూడా ఒకటి. వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా.. అందంగా కూడా పెరుగుతుంది. చర్మం కాంతి వంతంగా, జుట్టు బలంగా తయారవుతుంది. ఆయుర్వేదంలో కూడా అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది.

అయితే అంజీర్ పండ్లను నానబెట్టి తింటేనే పోషకాలు అన్నీ అందుతాయి. కేవలం అంజీర్ మాత్రమే కాకుండా అంజీర్ నానబెట్టిన నీటిని తాగినా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి:- అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి డయాబెటీస్‌తో బాధ పడేవారు నాన బెట్టిన అంజీర్ తిన్నా.. నీటిని తాగినా ఎలాంటి సమస్య ఉండదు. ఈ నానబెట్టిన నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఎక్కువగా పోటాషియం ఉంటుంది.

వెయిట్ లాస్ అవుతారు..అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వల్ల వెయిట్ లాస్ అయ్యేంతుకు సహాయ పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు ఉదయాన్నే అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం మంచిది. రక్త పోటును తగ్గిస్తుంది.. అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభ్యమవుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. రక్త పోటును కూడా తగ్గిస్తాయి. కాబట్టి హై బ్లడ్ ప్లజర్‌తో ఇబ్బంది పడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ వాటర్ తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది.

దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. గుండె పోటు, స్ట్రోక్, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..ప్రతి రోజూ నానబెట్టిన అంజీర్ వాటర్ తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో ఉంటే ట్యాక్సిన్స్ మలం ద్వారా బయటకు పోతాయి. దీంతో చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అంతే కాకుండా అంజీర్ వాటర్ ను చర్మంపై కూడా రాసుకోవచ్చు. దీని వల్ల మృత కణాలు ఏమైనా ఉంటే తొలగి.. కాంతి వంతంగా కనిపిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker