Health

అరటి ఆకులో భోజనానికి అంత ప్రత్యేకత ఎందుకో తెలుసా ..?

భోజనాన్ని ఇత్తడి, స్టీల్‌, ప్లాస్టిక్‌ ప్లేట్లలో కాకుండా ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు అకుపచ్చని కింద చెప్పిన ఆకుల్లో తింటే ఎన్నో ఉపయోగాలు. పూర్వకాలం నుంచి మనదేశంలో ఉన్న సంప్రదాయం.. ఆరోగ్యం, పర్యావరణ హితమైన పద్ధతి. ఆయా పదార్థాలను…అరటి, రావి, మోదుగ, మర్రి, వంటి పచ్చటి చెట్ల ఆకుల్లో భోజనం అన్ని రకాలుగా శుభకరము, ఆరోగ్యకరము అని ఆయుర్వేదం చెబుతోంది. ఆరోగ్య శాస్త్రాలు, పురాతన శాస్త్రాలు అనుసరించి, అరటి ఆకులలో భోజనం ఉత్తమమని తెలుపుతున్నాయి, చెట్ల ఆకుల్లో ఔషధ గుణాలుంటాయి, అవి శరీరానికి ప్రత్యేకంగా, కానీ పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి.

అయితే పండుగల సమయంలో అరటి ఆకుల్లో భోజనాలు చేయడం ఆనవాయితీ. పూర్వకాలంలో ప్రతి రోజూ అరటి ఆకులోనే భోజనం చేసేవారు. కానీ ఈరోజుల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అరిటాకు భోజనం చేస్తున్నారు. ఇప్పటికీ అరటి ఆకును భోజనానికి వినియోగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజల భోజనంలో సంబార్, రసం వంటి ద్రవరూపంలో ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ. అందువల్ల అరటి ఆకులో తినడం సులభం. పదార్థాలలో ఉండే నెయ్యి, నూనె కూడా ఆకుకు అంటుకోవు.

కనుక ఏం ఇబ్బంది లేకుండా తినటానికి సులవుగా ఉంటుంది. కానీ, ఆకుకు చిల్లు పడకుండా జాగ్రత్తగా తినాలి. గ్రీన్ టీ లాగే అరటి ఆకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, యాంటీ బ్యాక్టీరియల్ కూడా. అందువల్ల ఆహారంలోని సూక్ష్మజీవులను హరించి వేస్తుంది. అరటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను హరిస్తాయని చాలా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. తాజా అరటాకు మీద పలుచని మైనపు పొర సహజంగా ఉంటుంది. వేడివేడి పదార్థాలు వడ్డించినపుడు అది కరుగుతుంది.

అలా కరిగినపుడు కమ్మని వాసన వెలువడుతుంది. ఇది ఆహార పదార్థాలకు ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ను ఇస్తుంది. ముఖ్యంగా వేడి వేడి రసం, అన్నం కలిపి అరటాకులో భోజనం చేసినప్పుడు దీన్ని గుర్తించవచ్చు. ఇవి వాటర్ ప్రూఫ్ కావడం వల్ల కావడం వల్ల వీటి మీద ఎలాంటి రసాయనాలు చల్లినా అవి ఆకుకు అంటుకోవు. కాబట్టి వీటి వల్ల హాని తక్కువ. అరటి ఆకులను కొన్ని ఆయుర్వేద మందుల్లో కూడా వాడతారు. కొన్న రకాల మందులను స్వల్పకాలం పాటు ప్యాక్ చెయ్యడానికి కూడా వినియోగిస్తారు.

అరటి ఆకులను తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. మంచి జీర్ణవ్యవస్థ కడుపు సంబంధిత సమస్యలను చాలా వరకు దూరంగా ఉంచుతుంది. అరటి ఆకుల్లో తింటే జుట్టు పొడవుగా పెరుగుతుంది.కేశాలకు మంచి మెరుపు వస్తుంది. అంతేకాదు.. మెరిసే చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, అరటి ఆకుల్లో తినడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు నయమవుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker