అరుంధతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇంతలా మారిపోయిందేంటి. చూస్తే షాక్ అవ్వాల్సిందే.
తెలుగు, తమిళ్ లో అగ్ర హీరోలందరితో నటించి ఆల్ టైం సక్సెస్ హీరోయిన్ అనిపించుకున్నారు అనుష్క. ఆమె కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అలా మొదటిసారిగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ‘అరుంధతి’లో నటించి అలరించింది. అయితే అనుష్క కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అరుంధతి ఒకటి. నిజానికి అరుంధతి సినిమాతోనే అనుష్క క్రేజ్ పెరిగింది.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అనుష్క నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో నటించిన అనుష్క ఈ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు అడుగులేసింది. ఇక ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విలన్ గా నటించిన సోనూసూద్ గురించి పశుపతి పాత్రలో ఆయన ప్రేక్షకులను భయపెట్టారు.
ఆ అమ్మడి పేరు దివ్యనగేష్. దివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది . దివ్య 2014లో తమిళ చిత్రం శైవంతో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తెలుగులో అరుంధతి సినిమాతో పరిచయం అయ్యింది. అరుంధతి సినిమాలో తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివ్య నగేష్.
అరుంధతి సినిమా దివ్య నగేష్ కు తన కెరీర్ లో మర్చిపోలేని సినిమా గా నిలిచిపోయింది. అరుంధతి సినిమా అప్పట్లో రిలీజ్ అయ్యి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవిలో ప్రసారం అయితే చూసే ప్రేక్షకులు చాల మందే ఉన్నారు. మొన్నామధ్య హీరోయిన్ గా దివ్య నగేష్ మలయాళంలో పలు సినిమాలు చేసింది.
అలాగే తెలుగులో నేను నాన్న అబద్దం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.