ఈ కాలంలో ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగర్తలు ఇవే, లేదంటే ఆస్తమా ఎటాక్ తో..?
ఆస్తమా ఉన్నవాళ్లు వ్యాయామం చేయడం కూడా చాలా మంచిది. వ్యాయామం చేయడం వలన ఆస్తమా ఎటాక్స్ తగ్గే అవకాశం ఉంది. వ్యాయామంతో రక్తప్రసరణ పెరిగి, కేలరీలు వినియోగమై బరువు తగ్గుతారు. బరువు తగ్గేకొద్దీ ఆస్తమా రిస్కు క్రమేపీ తగ్గుతుంది. రక్తప్రసరణ పెరగడం వల్ల మంచి ఆక్సిజన్ అంది శరీరంలో ఉండే అవయవాలన్నీ శక్తివంతంగా తయారవుతాయి. అయితే ఆస్తమా అనేది శ్వాసనాళాల వాపు వల్ల వస్తుంది. ఆస్తమా బారిన పడిన రోగులు.. గురక, శ్వాస ఆడక పోవడం, ఛాతీ బిగుతుగా పట్టేసినట్టు అనిపించడం, దగ్గు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి.
అలాగే ఈ లక్షణాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీనికి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఆస్తమా ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది ఎవరికైనా రావచ్చు. వానాకాలంలో వాతావరణం చల్లగా మారుతుంది. దీనివల్ల శరీరంలో హిస్టామిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది శ్వాసలో గురక వచ్చేలా చేస్తుంది. ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తుంది. వానాకాలంలో పువ్వులు వికసించడం అధికంగా ఉంటుంది. దీని వల్ల పుప్పొడి గాలిలో అధికంగా చేరుతుంది.
గాలి ద్వారా ఆ పుప్పొడి ఆస్తమా ఉన్నవారికి ఎలర్జీగా మారుతుంది. దీనివల్ల ఆస్తమా లక్షణాలు పెరుగుతాయి. వాతావరణంలో తేమ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఆస్తమా తీవ్రంగా మారే అవకాశం ఉంది. అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉంటే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆస్తమాకు కారణం అవుతుంది. వానలు పడుతున్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆస్తమా రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వేడి వేడి ఆహారాలను, పానీయాలను తరచూ తాగుతూ ఉండాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే బ్రౌన్ రైస్, మొలకలు, ఆకుకూరలు, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, గుడ్లు వంటివి తింటూ ఉండాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆవిరి పీల్చడం ద్వారా శ్వాసనాళాలకు వ్యాకోచించేలా చేయాలి. నూనెలు వంటివి ముఖానికి, తలకు రాసుకోవడం తగ్గించాలి. ఇవి శ్వాసనాళాలకు చికాకును కలిగిస్తాయి. మీరు ఉండే ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. దుమ్ము ధూళి వంటివి లేకుండా చూసుకోండి.
ఎయిర్ కండిషనర్లకు సంబంధించిన ఫిల్టర్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. దిండు కవర్లు, బెడ్ షీట్లను పరిశుభ్రంగా ఉంచుకోండి. అనారోగ్యంగా ఉన్న వారికి దూరంగా ఉండండి. కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో తిరగకండి. ధూమపానం చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళకండి. ఆ పొగ వల్ల ఆస్తమా పెరిగిపోతుంది. పెంపుడు జంతువులకు కూడా దూరంగా ఉండండి.