News

హీరోయిన్ అదితి రావ్ హైదరీ మొదటి భర్త ఎవరో తెలుసా..?

తెలుగుతో పాటుగా తమిళ్ ,హిందీ ఇండస్ట్రీలో కూడా సిద్ధార్థ హీరోగా సినిమాలు చేశాడు. 2003లో బాయ్స్ మూవీ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సిద్ధార్థ యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో అప్పట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. త్రిష నువ్వు వస్తానంటే నేనొద్దంటానా.. జెనీలియా బొమ్మరిల్లు.. ఇలా అతని ఖాతాలో మంచి కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు ఉన్నాయి. అయితే నటుడు సిద్ధార్థ్‌, నటి అదితి రావు హైదరీ వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే అదితి మొదటి భర్త గురించి మీకు తెలుసా?అదితి రావ్ హైదరీ మొదటి భర్త సినిమాల్లో కెరీర్‌ను ప్రారంభించాడు కానీ OTTలో అతడికి పెద్ద గుర్తింపు వచ్చింది. అదితి రావు హైదరీ మొదటి వివాహం ప్రముఖ నటుడు సత్యదీప్ మిశ్రాతో 2002లో జరిగింది. చాలా ఏళ్లు తమ పెళ్లి గురించి ఇంటర్వ్యూలలో ఎక్కడా ప్రస్తావించని అదితీ..2013లో ఓ ఇంటర్వ్యూలో తాము విడాకులు తీసుకున్నట్లు తెలిపింది.

అదితి మొదటి భర్త సత్యదీప్ మిశ్రా.. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)ఆఫసర్ గా, కార్పోరేట్ లాయర్‌గా కూడా చాలా కాలం పనిచేశారు. అదితి మొదటి భర్త సత్యదీప్ ముంబైలో అడ్వర్టైజింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించాడు. అతని మొదటి సినిమా ‘చిల్లర్ పార్టీ’. కానీ ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ సినిమాతో అతనికి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో అతను రాణి ముఖర్జీతో కలిసి కనిపించాడు. ఈ సినిమా తర్వాత అతని నట జీవితం ఊపందుకుంది.

సత్యదీప్‌కి సినిమాల్లో అంతగా గుర్తింపు రాకపోవడంతో OTT వైపు మొగ్గు చూపాడు. అతని కెరీర్‌లో ఇప్పటివరకు ‘ఇల్లీగల్ సీజన్ వన్’, MX ప్లేయర్ కోసం ‘థింకిస్థాన్’, ‘జెహనాబాద్ – లవ్ అండ్ వార్’, నెట్‌ఫ్లిక్స్ షో ‘మసాబా మసాబా’లో కనిపించాడు. అదితి రావ్ హైదరీతో విడాకుల తర్వాత సత్యదీప్ మిశ్రా.. 2013 జనవరి 27న అగ్ర నటి నీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తాను వివాహం చేసుకున్నాడు..ఇది మసాబాకు కూడా రెండో వివాహం. మసాబా మొదటి వివాహం నిర్మాత మధు మంతెనతో జరిగింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker