ఈ కాలంలో ఖచ్చితంగా తినాల్సిన పండు ఇదే. ఈ ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా తింటారు.

అవకాడోలు సాధారణంగా స్థానిక మార్కెట్‌లో అందుబాటులో ఉండదు. ఇవి ఎక్కువగా సూపర్ మార్కెట్‌లలోనే లభ్యమవుతాయి. అవకాడో తినడం చాలా శ్రేయస్కరం, ఈ పండులో అనేకమైన పోషకాలు ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే అవకాడో ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దీనిని అందరూ సూపర్ ఫుడ్ ప్రశంసిస్తారు. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఒక పండులో 19 గ్రాముల అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, 10 గ్రాముల ఫైబర్‌తో సహా 13 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి.
అంతేకాకుండా దీనిలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్లకు మూలం. అవోకాడోలో సమృద్ధిగా ఉండే కొవ్వులలో ఒకటైన ఒలిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. మరోవైపు, డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో అవకాడో తీసుకోవటం ద్వారా కలిగే ప్రయోజనాలు :- ఈ పండు కళ్ళకు మంచిది. అవోకాడోలోని రెండు కెరోటినాయిడ్లు లుటిన్ , జియాక్సంతిన్, కంటి చూపును కాపాడగలవని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా, అవోకాడో తీసుకోవటం వల్ల అధిక క్యాలరీ కంటెంట్ ఉన్నప్పటికీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చల్లని వాతావరణం చర్మంపై ప్రభావం చూపుతుంది. దీని వలన పొడిబారడం, పొలుసులు రాలటం, దురద రావటం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో తామర ఇతర చర్మ రుగ్మతలను తీవ్రతరం చేస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన అవకాడో శీతాకాలంలో పొడి చర్మంతో పోరాడటానికి , చర్మానికి మెరుపును పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.
ఈ పండులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీఫెనాల్స్ మరియు ఇతర పోషకాలు వృద్ధాప్యాన్ని నెమ్మదింప చేస్తాయి. చర్మ రూపాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవోకాడో విటమిన్ సితో నిండి ఉంటుంది. ఇది కొల్లాజెన్ సంశ్లేషణను ప్రోత్సహించే పోషకం. ఈ సమ్మేళనం యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కూడా కలిగి ఉంది, అతినీలలోహిత వికిరణం నుండి చర్మాన్ని కాపాడుతుంది. అవోకాడోస్‌లోని మరో కీలక పోషకమైన విటమిన్ ఇ, మంటతో పోరాడుతుంది.
చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుండి కాపాడుతుంది. అదే సమయంలో గాయం నయం చేయడాన్ని వేగవంతం చేస్తుంది. ముడతలు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ ఎ కూడా ఉంటుంది, ఇది కొవ్వులో కరిగే పోషకం, ఇది కొల్లాజెన్ విచ్ఛిన్నం, పొడి, దురద ను నిరోధించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించటానికి, అర్ధరైటిస్ నొప్పుల నుండి ఉపశమనానికి అవకాడో చలి కాలంలో బాగా ఉపకరిస్తుంది.