అయోధ్యలో అద్భుతం..కళ్లు కదిలించిన బాల రాముడు. వైరల్ అవుతున్న వీడియో.
బలరాముడు మనలాగే కళ్లను కదిలించే దృశ్యాన్ని చూస్తే అసలు రాముడు తానేమో అనిపిస్తుంది. కళ్లు తెరిచే బాల రాముడు ఏఐ టెక్నాలజీ సృష్టి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ఆకర్షిస్తోంది. AI సాంకేతికతను ఉపయోగించి అయోధ్యలోని బలరాముడి విగ్రహం యొక్క వీడియోను బలరాముడు మనల్ని చూస్తున్నట్లుగా భావించడం.
అయితే అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన చారిత్రాత్మక ఘట్టం సోమవారం పూర్తయ్యింది. రాముని జన్మస్థలం లో 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామయ్య కొలువు తీరారు. మంగళవారం నుంచి బాల రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు.
అద్భుతమైన రూపం, చిరు ధరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివెళ్తున్నారు. ఇక అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో కొలువైన బాలరాముడు లేదా రామ్ లల్లా ఫోటోలతో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఈ క్రమంలోనే ఒక కొత్త వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
తాజాగా వైరల్ అవుతున్న ఆ వీడియోలో అయోధ్య రామ మందిరంలోని బాలరాముడిని చూస్తే అది విగ్రహం కాకుండా ప్రత్యక్షంగా ఒక మనిషిని చూసినట్లే కనిపిస్తోంది. బాల రాముడు..చిరునవ్వుతో కంటి రెప్పలు కొడుతూ తలను అటూ ఇటూ కదిలిస్తూ చూస్తున్నట్లున్న ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. బాలరాముడు కళ్లు తెరిచి ఉన్నట్లు ఉన్న ఈ వీడియోను చూసి భక్తులు పరవశించిపోతున్నారు.
Now who did this? 🤩🙏 #Ram #RamMandir #RamMandirPranPrathistha #RamLallaVirajman #AyodhaRamMandir #Ayodha pic.twitter.com/2tOdav7GD6
— happymi (@happymi_) January 22, 2024