News

మీకు కలలో చనిపోయిన తల్లితండ్రులు కనిపిస్తున్నారా..? దీని అర్థం ఏంటంటే..!

చనిపోయిన వ్యక్తులు కలలో కనిపిస్తే ఏమి జరుగుతుంది? కలలో చనిపోయినవారిని చూడటం అంటే మంచిదేనట. చాలా కాలం జీవిస్తారట. చనిపోయిన వారు వచ్చి మనలను ఆశీర్వదించినట్లు కలలుగన్నట్లయితే, అన్ని రకాల శుభాలు జరుగుతాయని అర్థం. అయితే రాత్రి పడుకున్న తర్వాత కలలు రావడం సాధారణ విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే రాత్రి పడుకున్న తర్వాత వచ్చే కలలు మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు.

మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మనకు జరగబోయే విషయాలకు సంబంధించి సూచనలు అందిస్తుంటాయని స్వప్న శాస్త్రంలో కూడా వివరించారు. ఇక సైన్స్‌ ప్రకారం గాఢ నిద్రలో ఉన్న సమయంలో మెదడు మరింత మరింత చురుకుగా పని చేస్తుంది. చనిపోయిన తల్లీ లేదా తండ్రి కలలో కనిపిస్తే వారి ఏదో కోరిక ఉందని అర్థం చేసుకోవాలి. వారికి చివరి కోరిక ఏదైనా తీరక పోయినా ఇలా కనిపిస్తుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే కలలో వాళ్లు కనిపించిన ఒక్కో విధానానికి ఒక్కో అర్థం ఉంటుందని పండితులు అంటున్నారు.

ఒకవేళ కలలో తల్లిదండ్రులు ఏడుస్తున్న కల వస్తే అశుభంగా భావించాలని చెబుతున్నారు. భవష్యత్తులో ఏదో అశుభవార్త వినే అవకాశాలు ఉంటాయని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి కలలు వస్తే పండితులతో పిండాలు పెట్టడం లాంటివి చేయాలని చెబుతున్నారు. ఇకవేళ చనిపోయిన పేరెంట్స్‌ కలలో నవ్వుతున్నట్లు, సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తే అది మంచి సూచనగా భావించాలి. మీ పేరెంట్స్‌ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అర్థం చేసుకోవాలి.

మీ ఎదుగుదల పట్ల వాళ్లు హ్యాపీగా ఉన్నారని, వచ్చే రోజుల్లో మీకు ఏదో శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. జీవితంలో పురోగతి పొందే అవకాశాలు ఉన్నాయని భావించాలి. ఇక చనిపోయిన తల్లిదండ్రులతో మీరు మాట్లాడుతున్నట్లు కల వస్తే మంచిగానే భావించాలి. ఏదో శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker