కలలో మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టు కలలు వస్తే ఏం జరుగుతుంది..?
చావు కలలు వస్తే.. చాలా మంది భయపడి పోతూ ఉంటారు. ఇంకొంత మంది బాగా ఏడుస్తూ ఉంటారు. చావు కలలు రావడం మంచిదని స్వప్న శాస్త్రం చెబుతోంది. రోగాలతో బాధ పడుతున్న వ్యక్తి చనిపోయినట్టు కలలో వస్తే.. అది శుభ ప్రదమట. ఇలాంటి కల పడితే ఆ వ్యక్తి ఆరోగ్యం మెరుగు పడుతుందని అర్థం వస్తుందట. అయితే సాధారణంగా కలలు అనేవి అందరికీ వస్తాయి. అయితే కొన్ని కలలు చాలా అద్భుతంగా, అందంగా ఉంటాయి.
కానీ మరికొన్ని కలలు మాత్రం వింతగా, భయంగా ఉండి ఆందోళనకు గురిచేస్తాయి. ఇవి ఉదయం నిద్ర లేచి తర్వాత కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ కలలో ఒక్కోసారి మన కుటుంబ సభ్యులు చనిపోయినట్టు కూడా వస్తాయి. ఇవి చాలా మంది భయ పడిపోతూ ఉంటారు. ఇంకొంత మంది అయితే ఏడుస్తూ ఉంటారు. మరి ఇలా కల రావడానికి అర్థం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా మీ కుటుంబ సభ్యులు చనిపోయినట్టు కలలు వస్తే.. మీవారికి ఆయుష్షు పెరుగుతుందట. వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలు ఏమైనా ఉంటే వెంటనే తొలగి పోతాయి. ఇలాంటి కలల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. మీకు కొన్ని శుభాలు కూడా జరగబోతాయని ఆ కలలు చెబుతాయి. కాబట్టి ఇలాంటి కలలు వస్తే చింతించాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కోసారి ఇలాంటి తెల్లవారు జామున వస్తాయి.
అలాంటి సమాయాల్లో వచ్చినప్పుడు.. వీటికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. వ్యక్తులు చనిపోయినట్టు భయంకరమైన కలలు వస్తే ఉదయాన్నే లేచి స్నానం చేసి.. గజేంద్ర మోక్షం పఠించినా విన్నా పర్వాలేదు. లేదంటే దగ్గర్లోని పండితులను కలిసి వారికి మీ కల గురించి వివరించాలి. వారు చెప్పినటువంటి సూచనలు తీసుకోవాలి.