News

నందమూరి బాలకృష్ణ పెళ్లి శుభలేఖ చూసారా..? పెళ్లి పత్రికలో స్పెషల్ ఎంతో తెలుసా..?

సోషల్ మీడియా కారణంగా సెలెబ్రిటీల పర్సనల్ జీవితాల్లోని విశేషాలు కూడా చాలా మందికి తెలుస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా లో ఒక పెళ్లి పత్రిక ఒకటి తెగ వైరల్ అవుతోంది. అది ఎవరిదో కాదు.. ఆరుపదుల వయసులోనూ సింహంలా దూసుకుపోతున్న నట సింహం బాలయ్య బాబుది. నందమూరి నట వారసుడు బాలకృష్ణ పెళ్లి నాటి శుభలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే బాల‌య్య పెళ్ళికి సబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. బాలయ్య వసుందరాదేవి పెళ్లి చేసుకున్నప్పటి వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. బాలకృష్ణ పెళ్ళి టైమ్ కు ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారట. ఎన్టీఆర్ బిజీగా ఉన్న టైమ్ లోనే వసుందర తో బాలకృష్ణ పెళ్లి కుదిరిందట. బాలయ్య భార్య వారి బంధువులే అని సమాచారం.

బాలయ్య వెడ్డింగ్ కార్డ్ లో పెళ్లి ఎక్కడ జరిగింది.. ముహూర్తం ఏప్పుడు అనేది క్లియర్ గా ఉంది. తిరుపతిలో పెళ్ళి జరగ్గా.. బుదవారం మధ్యాహ్నంముహూర్తంలో పెళ్లి జరిగింది. అయితే ప్రస్తుంతం వైరల్ అవుతున్న ఈకార్డ్ నందమూరి వారిది కాదు. వసుందరా దేవి పుట్టింటి వారి పెళ్లి కార్డ్ కావడం విశేషం. వ‌సుంద‌ర దేవి తండ్రి ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త దేవుర‌ప‌ల్లి సూర్యారావు.

ఇక 1982 డిసెంబ‌ర్ 8న వ‌సుంద‌ర దేవి బాల‌య్య వివాహం జ‌రిగింది. ఇక ప్ర‌స్తుతం వీరి పెళ్లి శుభ‌లేఖ నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీరి పెళ్ళి తిరుపతిలోని కర్నాటక మండపంలో జరిగినట్టు అందులో ఉంది. చాలా సింపుల్ గా.. ఉన్న ఈ పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker