బత్తాయి పండుని చులకనగా చూడకండి, ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..?
బత్తాయిలోని పొటాషియం రక్తపోటును నివారించుటకు చక్కగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో అనేక విషాలను బయటకు పంపుతుంది. బ్లాడర్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇందులోని క్యాల్షియం ఎముకల బలానికి మంచి ఔషధంగా సహాయపడుతుంది. మెదడు, నాడీవ్యవస్థ చురుగ్గా ఉండేందుకు బత్తాయి పండు చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆరోగ్యం కోసం కచ్చితంగా తినాల్సిన పండ్లలో మోసంబి మొదటి స్థానంలోనే ఉంటుంది. ఈ పండును తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటివల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల 45 కేలరీలు అందుతాయి. అలాగే విటమిన్ సి, ఫైబర్ కూడా శరీరానికి అందుతుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి. పొట్టలో మంట, అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు బత్తాయి పండును తినేందుకు ప్రయత్నించండి. డీహైడ్రేషన్ సమస్య ఎక్కువ మందిని వేధిస్తూ ఉంటుంది. అలాంటివారు బత్తాయి పండు రసాన్ని ఇంట్లోనే చేసుకుని తాగండి. అయితే అందులో చక్కెర వేయొద్దు.
దీనిలో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి.ఈ పండు తినడం వల్ల డిహైడ్రేషన్ సమస్య చాలా త్వరగా తగ్గిపోతుంది. అలాగే మోసంబి రోజూ తాగితే మీ చర్మం చాలా మృదువుగా మారిపోతుంది. కాంతివంతంగా మారుతుంది. జుట్టు పెరుగుదలపై కూడా మోసంబి చాలా ప్రభావం చూపిస్తుంది. జుట్టు మంచిగా ఎదిగి పట్టుకురుల్లా ఉంటాయి. కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా బత్తాయి కాపాడుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు బత్తాయిని తినేందుకు ప్రయత్నించాలి.
ఎంతోమంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు బత్తాయి పండును తమ డైట్లో చేర్చుకోవాలి. ఇది బరువును త్వరగా తగ్గిస్తుంది. కొందరికి వాంతులు, వికారం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటివారు ఈ పండును తింటే ఆ లక్షణాలు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే మోసంబి ఎంతో సహకరిస్తుంది. ఈ పండును రోజూ ఒకటి తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే సమస్య పూర్తిగా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
అలాగే కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా బత్తాయిని తినడం అలవాటు చేసుకోవాలి. ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి చిగుళ్ళు, నాలుక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఎంతో మంది స్త్రీలకు కాలి పాదాలు పగిలిపోతూ ఉంటాయి. ఆ సమస్య నుంచి బయటపడేసే సత్తా మోసంబికి ఉంది. కాబట్టి బత్తాయి పండును కచ్చితంగా చేర్చుకోండి.