ఈ బ్యూటీ టిప్స్ పాటిస్తే చాలు, 40ల్లో కూడా 20లా కనిపిస్తారు.
అందం చూసేవాళ్ళకి ఎలా తెలుస్తుందని ఎవరైనా అడిగితే వెంటనే మనం ముఖం ద్వారా అని టక్కున చెప్పేస్తాం ! మరి ఆ ముఖం ఎల్లప్పుడు ఏ కాలమైన అందంగా ఉండాలన్నా, నలుగురిలో అందంగా కనబడలన్నా మనం ఎప్పటికప్పుడు కొన్ని చిట్కాలు ఉపయోగించడం మంచిది కదా.. అయితే ప్రతి అమ్మాయి ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటుంది. అయితే 40 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు వారి రూపం గురించి ఆందోళన చెందుతుంటారు.
వయస్సు పెరుగుతున్న కొద్దీ.. ముఖంపై ముడతలు, తెల్లవెంట్రుకలు, మచ్చలు, చర్మం కాంతివంతంగా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. దీంతో అంద విహీనంగా కనిపిస్తారు. పెరుగుతున్న వయస్సును ఆపలేము కానీ దాని ప్రభావాన్ని తగ్గించడం మాత్రం సాధ్యమే. మీరు 40 ఏళ్ల వయస్సులో కూడా బాలీవుడ్ నటిలా కనిపించాలంటే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తినాలి. బొప్పాయి.. మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుకోవాలంటే, రోజూ బొప్పాయిని తినండి. ఎందుకంటే ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.
కాబట్టి చర్మ సంరక్షణ కోసం బొప్పాయిని తినడం మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల ఇది వృద్ధాప్యానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. దానిమ్మ.. దానిమ్మలో పునికాలాగిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ను సంరక్షిస్తుంది. మీ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. కాబట్టి మీ చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే, దానిమ్మను తినవచ్చు. ఇలా చేయడం వల్ల 40 ఏళ్ల వయసులో కూడా 20ఏళ్లుగా కనిపిస్తారు. క్యాబేజీ.. క్యాబేజీ బలమైన యాంటీఆక్సిడెంట్లని కలిగి ఉంటుంది.
వీటి సహాయంతో సెల్ నష్టాన్ని నివారించవచ్చు. సూర్యుని ప్రమాదకరమైన UV కిరణాల నుంచి రక్షింపబడుతాము. క్యాబేజీని సలాడ్‌గా లేదా తేలికగా ఉడికించి తినవచ్చు. క్యారెట్.. క్యారెట్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ఇది చర్మానికి అంతర్గత పోషణను అందిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీరు ప్రతిరోజూ పచ్చి క్యారెట్‌లను తింటే ముఖంపై వృద్ధాప్య ప్రభావం తగ్గుతుంది. ఆరెంజ్.. ఆరెంజ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
దీంతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా మీ ముఖం గ్లో చెక్కుచెదరకుండా ఉంటుంది. పచ్చని ఆకుకూరలు.. ఆకు కూరల్లో ఉండే క్లోరోఫిల్ చర్మంలో కొల్లాజెన్‌ని పెంచుతుంది. ఇది వృద్ధాప్యంతో పోరాడటానికి శరీర మూలకాలను సహాయపడుతుంది.పెరుగు.. పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది శరీరంలోని మంచి బ్యాక్టీరియాను పోషిస్తుంది. అయితే పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ముడతలను తొలగిస్తుంది. శరీర రంధ్రాలను నింపుతుంది. పెరుగులో ఉండే విటమిన్ బి12 చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.