News

పాపం కృతి శెట్టి.. అంత మాట అనేశాడు ఏంటి..? దీంతో షాక్ అయిన బేబమ్మ.

కృతి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వంటి సినిమాలు చేసారు. ఇవన్నీ యావరేజ్‌గా ఆడాయి. తెలుగులో మళ్లీ మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు కృతి. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఓ చీరల షాపు ఓపెనింగ్‌కి వెళ్లిన కృతికి ఫ్యాన్ నుండి వెరైటీ ప్రశ్న ఎదురైంది. అయితే శర్వానంద్ హీరోగా నటిస్తున్న 35 సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికైంది.

అయితే తెలుగులో సినిమాలు లేకపోయినా ఆమెకు చేతినిండా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అంటే అదేనండీ షాప్ ఓపెనింగ్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అభిమానులతో ఆమె ముచ్చటించింది. ఈ క్రమంలో ఒక అభిమాని ఆమెను మెచ్చుకుంటూ మీ స్కందా సినిమా చూశాను చాలా బాగుంది అని పేర్కొన్నాడు. వాస్తవానికి స్కంద సినిమాలో ఆమె హీరోయిన్గా నటించలేదు.

శ్రీ లీల హీరోయిన్గా నటించడంతో ముందు కాస్త డౌట్ వచ్చినా ఆమె వెంటనే అవును బాగుంది కానీ నేను ఆ సినిమాలో నటించలేదు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన ఆమె అభిమానులు అయితే అదేంది మామ అంత మాట అనేశాడు అని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker