Health

నెయ్యిని ఇలా బొడ్డులో వేసి చూశారా..! ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి.

భారతదేశం యొక్క అత్యంత విలువైన ఆహారాలలో నెయ్యి ఒకటి. నెయ్యి పాల నుండి తయారవుతుంది. దీనిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ, బ్యూట్రిక్ యాసిడ్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నెయ్యి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అయితే నెయ్యి వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే.

నెయ్యిని రోజూ తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరానికి శ‌క్తి కూడా ల‌భిస్తుంది. క్యాల‌రీలు పెరుగుతాయ‌న్న భ‌యం కార‌ణంగా నెయ్యిని మ‌న‌లో చాలా మంది తిన‌రు. కానీ ఆయుర్వేదం ప్ర‌కారం నెయ్యిని వాడ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. దీన్ని వైద్యంలో ఉప‌యోగిస్తారు. అయితే నెయ్యిని లోప‌లికి తీసుకోవ‌డ‌మే కాదు.. బొడ్డులోనూ వేయ‌వ‌చ్చు.

అవును.. షాకింగ్ గా ఉన్నా ఇది నిజ‌మే. నెయ్యిని బొడ్డులో వేయ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా మారుతుంది. పొడి చ‌ర్మం ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. చ‌ర్మం సంర‌క్షించ‌బ‌డుతుంది. ఆయుర్వేద ప్ర‌కారం బొడ్డు అనేది పోష‌కాల‌ను శోషించుకునేందుకు శ‌రీరానికి ఒక ముఖ్య స్థానంగా భావిస్తారు. అందువ‌ల్ల అందులో నెయ్యి వేస్తే నెయ్యిలో ఉండే పోష‌కాల‌న్నీ మ‌న‌కు ల‌భిస్తాయి.

దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. బొడ్డులో నెయ్యిని వేయ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉండ‌వు. బొడ్డులో నెయ్యి వేయ‌డం వ‌ల్ల శ‌రీరం రిలాక్స్ అవుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారి ఒత్తిడి త‌గ్గుతుంది. దీంతో టెన్ష‌న్‌, ఆందోళ‌న పోతాయి. నిద్ర స‌రిగ్గా ప‌డుతుంది.

నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా నెయ్యిని బొడ్డులో వేయ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. అయితే ఈ విధంగా చేసే ముందు డాక్ట‌ర్ స‌ల‌హా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది అంద‌రికీ ప‌డ‌క‌పోవ‌చ్చు. క‌నుక డాక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇలా చేస్తే ఉత్త‌మం. అనుకున్న ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌వ‌చ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker