Health

షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ కాలంలో ఈ పండును గుర్తుపెట్టుకొని మరి తినాలి. ఎందుకంటే..?

వర్షాకాలంలో ఈ బేరి పండును రోజుకు ఒకటి తినాలని వైద్యులు చెప్తున్నారు. ఈ పండు తినడం వలన క్యాన్సర్ నుంచి గుండెపోటు నుంచి అలాగే మలబద్ధకం నుంచి కొలెస్ట్రాల్ నుంచి ఈ పండు కాపాడుతుంది. ఈ పండును ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తీసుకోకూడదు. ప్రధానంగా ప్రకృతి సహజసిద్ధంగా దొరికే పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ ఆహారం కంటే పండ్లు తినడం వల్ల అదనపు శక్తి అందుతుంది.

అంతేకాకుండా తక్షణ ఎనర్జీ కోసం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. అయితే కాలానుగుణంగా కొన్ని పండ్లు మార్కెట్లో దర్శనమిస్తుంటాయి. చాలా మంది వీటిని అవైడ్ చేస్తుంటారు. కానీ ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో కచ్చితంగా తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వర్షాకాలంలో ఎక్కువగా బేరిపండ్లు మార్కెట్లోలభిస్తుంటాయి. చాలా మందికి వీటి గురించి అవగాహన ఉండదు. దీంతో పట్టించుకోరు.

కానీ ఇందులో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరు. చూడడానికి జామపండులా ఉండే ఇందులో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే. బేరిపండ్లలో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులో పోలేట్, విటమిన్ సి, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఉండే పెక్టిన్ అనే పదార్థం ఫైబర్ ను కలిగి ఉంటుంది. ఇది డయాబెటీస్, షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

ఫ్యాటీ లివర్ తో సంభవించే సమస్యలు ఈ పండు మెడిసిన్ లా పనిచేస్తుంది. బరువు తగ్గానుకునేవారు దీనిని కచ్చితంగా తీసుకోవలి. పియర్ తొక్కలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు పియర్ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. రక్తంలో ఉండే చక్కెర నిల్వలను నియంత్రించడంలో ఈ పండు సహకరిస్తుంది. అందువల్ల దీనిని షుగర్ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా తినాలని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.

వీరు మాత్రమే కాకుండా మూత్రాశయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఇది నయం చేస్తుంది. బేరిలోనిఉర్సోలిక్ యాసిడ్, ఆరోమాటేస్ చర్యను నిరోదిస్తుంది. అందువల్ల ఇది ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకుండా తినడానికి ప్రయత్నించడి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker