భోజనం తర్వాత పొగ తాగే అలవాటు ఉందా..? మీరు క్యాన్సర్ ని ఆహ్వానిస్తున్నట్టే..!

చాలా మంది భోజనం చేసిన తర్వాత తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ అవి వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. భోజనం చేసిన వెంటనే కొంతమంది సిగరెట్ వెలిగిస్తారు, మరికొంత మంది నేరుగా వెళ్లి మంచంపై పడుకొని రిలాక్స్ అవుతారు. కానీ దీనివలన మీకు కడుపులో అసౌకర్యం లేదా మగతగా అనిపించడం ఇతరత్రా సమస్యలు మీరు గుర్తించలేనివి ఉండవచ్చు. అయితే ధూమపానం మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి హానికరం.
భోజనం చేసిన తర్వాత పొగ తాగే అలవాటు ఉన్నవారు ఆ అలవాటు మానుకోవడం ఉత్తమం. ఎందుకంటే యునైటెడ్ కింగ్డం యొక్క నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ యూకే లో మరణాలు మరియు వ్యాధులకు అత్యంత.. ముఖ్యమైన కారణం ధూమపానం అని వెల్లడించింది. 2015 నాటికి భారత దేశంలో ధూమపానం చేసే పురుషుల సంఖ్య 108 మిలియన్ గా అంచనా వేయబడింది.
అంటే ఇప్పటికి ఆ సంఖ్య మరింత పెరిగి ఉంటుంది. మామూలుగా ధూమపానం చేస్తేనే ఆరోగ్యానికి హానికరం. అలాంటిది భోజనం చేసిన తరువాత ధూమపానం చేయాలనుకోవడం మరింత ప్రమాదకరం. ఆహారం తినేటప్పుడు శరీరం దానిని జీర్ణం చేసుకోవాలి అంటే శరీరం ఆహారాన్ని గ్రహించగలిగే రూపంలోకి మారాలి. మనం ఆహారాన్ని నోటిలో పెట్టుకోగానే జీర్ణక్రియ ప్రక్రియ మొదలవుతుంది.
నోటిలోని లాలాజలం నుంచి ఎంజైమ్లు ఈ ప్రక్రియను ప్రారంభిస్తాయి. మనం తినే ఆహారం దాదాపు నాలుగు గంటల పాటు కడుపులో ఉంటుంది. అదే సమయంలో సిగరెట్ కాల్చడం వలన శరీరం ఆహార పోషకాలను గ్రహించదు. అలాగే చిన్న ప్రేగులో నిల్వ ఉన్న ఆహారంలో పోషకాలను గ్రహించకుండా.. సిగరెట్ లోని నీకోటిన్ ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీనివలన నికోటిన్ రక్తంలోని ఆక్సిజన్ తో బంధిస్తుంది.
అలాగే సిగరెట్ తాగేటప్పుడు విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ పేగులు మరియు ఇతర అంతర్గత అవయవాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అందుకే భోజనం తర్వాత పొగ త్రాగటం వలన పెద్ద పేగు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి భోజనం తర్వాత సిగరెట్ కాల్చడం చేజేతులా క్యాన్సర్ని ఆహ్వానించటమే అవుతుంది.