News

బర్రెలక్క క్రేజ్ మాములుగా లేదుగా..! ఈసారి ఏకంగా బిగ్ బాస్ లోకే ఎంట్రీ.

ఉద్యోగాల భర్తీ విషయంలో బర్రెలను కాస్తూ ఆమె తీసిన ఓ వీడియో సంచలనంగా మారటంతో పాటు… రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారారు. ఈ విషయంలో ఆమెకు నిరుద్యోగుల నుంచి భారీగా మద్దతు కూడా వచ్చింది. మరోవైపు విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్.. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అనే పేరుతో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. 2022 ఫిబ్రవరీలో ఇది మొదలయ్యింది.

బిగ్ బాస్ ఓటీటీ అంటే అది కేవలం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లోనే ప్రసారం అవుతుంది.. టీవీలో టెలికాస్ట్ అవ్వదు. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2ను కూడా దాదాపు జనవరి, ఫిబ్రవరీలో ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఓటీటీ సీజన్ 2కి సంబంధించి కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయడం కూడా ప్రారంభించారట.

ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ అయినట్టు సమాచారం. వీరిలో శిరీష అలియాస్ బర్రెలక్క కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. సంచలనంగా మారింది. ఎన్నికల్లో అయితే ఓడిపోయింది కానీ.. జనాల్లో మాత్రం అంతకు మించిన క్రేజ్ సంపాదించుకుంది.

ఈక్రమంలోనే బర్రెలక్కకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వార్తలు వైరల్ అయ్యాయి. మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఎవరో ఒక సోషల్ మీడియా స్టార్.. కంటెస్టెంట్‌గా వస్తారు. ఈసారి ఆ కేటగిరిలో బర్రెలక్క అలియాస్ శిరీష వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్.. ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.

బర్రెలక్కతో పాటు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న భోళే షావలి కూడా ఓటీటీ సీజన్ 2లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇది వాస్తవమో కాదో తెలియాలంటే.. కొన్ని రోజులు ఎదురు చూడాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker