Health

మహిళలు బ్లాక్ కలర్ బ్రా ధరిస్తే రొమ్ముక్యాన్సర్ వస్తుందా..? అసలు నిజాలివే.

ఆరోగ్యం విషయానికి వస్తే మరింత ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. వాటిని మనం బలంగా నమ్ముతూ ఉంటాం. వాటినే చాలా సంవత్సరాలుగా గుడ్డిగా నమ్ముతూ వస్తుంటాం. అయితే, కానీ ప్రజలు నిజం అని నమ్ముతున్న కొన్ని విషయాల్లో అసలు నిజం కానివి కొన్ని ఉన్నాయి. అయితే రొమ్ము క్యాన్సర్ మహిళలలో సంభవించే ప్రమాదకరమైన జబ్బు. రొమ్ము లోపల క్యాన్సర్ కణాలు పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

మహిళల రొమ్ముల్లో సాధారణంగానే కండరాలు ఉంటాయి. చేత్తో తాకినప్పుడు ఇవి గడ్డల్లాగా చేతికి తగులుతుంటాయి. కానీ వీటిలో క్యాన్సర్ గడ్డలు కూడా ఉండే ప్రమాదముంది. రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా 50ఏళ్లు దాటిన మహిళలలోనూ, 1శాతం పురుషులలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ జీవనశైలి కారణంగా చిన్నవయసులో ఉన్న మహిళలలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది.

మహిళల రొమ్ముల్లో ఉండే గడ్డలు అకస్మాత్తుగా పరిమాణం పెరిగినా, రొమ్ముల ఆకృతిలో ఏదైనా మార్పు కనిపించినా, చనుమొన నుండి చీము లేదా నీరు లాంటి పదార్థం కారుతున్నా, చనుమొన చుట్టూ దురద పెట్టి చిన్న కురుపుల్లా వస్తున్నా వాటిని రొమ్ము క్యాన్సర్ లక్షణాలుగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితులలో వైద్యుడిని సంప్రదించాలి. కారణాలు, అపోహలు.. రొమ్ముక్యాన్సర్ విషయంలో చాలామందిలో ఒక నమ్మకం ఉంది.

అదే బ్రా ధరిస్తే రొమ్ము క్యాన్సర్ వస్తుందని. కానీ అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు. రొమ్ముల పరిమాణం పెద్దగా ఉన్నవారు బ్రా ధరించడం వల్ల ఎలాంటి హాని జరగదు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు స్పష్టం చేశారు. ఇకపోతే కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఆ తరువాత తరం వారికి కూడా క్యాన్సర్ వస్తుందని అంటారు.

జన్యుపరంగా ఆలోచిస్తే ఇది నిజమేనని వైద్యులు కూడా చెబుతారు. అదేవిధంగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్న మహిళలలో కూడ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ముందుగానే వైద్యులను కలిసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker