Health

నల్ల ద్రాక్షలు తింటున్నారా..? ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే..?

నల్ల ద్రాక్ష రుచిలో తీపిగా ఉంటుంది. వీటి వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నల్లటి ద్రాక్షలో సీ-విటమిన్‌, ఏ-విటమిన్, బీ6, ఫోలిక్‌ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ద్రాక్ష పండ్లలో ఉండే గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు మనల్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే నల్ల ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

దీంతో ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ఓ పరిశోధన ప్రకారం గ్రేప్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు నల్ల ద్రాక్ష తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. డైట్ చేసేవారు నల్ల ద్రాక్ష తీసుకుంటే శరీరం అలసటగా ఉండకుండా చేస్తుంది.

ద్రాక్షలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇవి ఎముకలను బలంగా ఉండేలా చేస్తుంది. పాలీ ఫెనాల్స్ రక్తంలోని చక్కెర నిల్వలను కంట్రోల్ చేస్తుంది. ద్రాక్ష తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. అందువల్ల వీటిని అప్పుడప్పుడు పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు ద్రాక్షనుతీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇక ద్రాక్ష దీర్ఘాయువు పెంచుతుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది.

ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. నల్ల ద్రాక్షను తీసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి కాస్త చేదుగా అనిపిస్తాయి. అలాంటి వారు జ్యూస్ చేసి తాగవచ్చు. ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఆకలి పెరుగుతంది. నోరు టేస్టీగా ఉండి ఎలాంటి ఇన్ఫెక్సన్ కాకుండా ఆపుతుంది.

అయితే చాలా మంది ఇవి మార్కెట్ నుంచి తీసుకొచ్చి నేరుగా తింటున్నారు. వీటిని ఇంటికి తెచ్చుకున్న తరువాత శుభ్రంగా కడిగిన తరువాతే తీసుకోవాలి. ఎందుకంటే వీటిపై ఉండే చిన్న బ్యాక్టీరియా అనారోగ్యానికి గురిచేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker