Health

ఈ కాలంలో నల్లద్రాక్షని తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి.

నల్ల ఎండుద్రాక్షలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన దృష్టిని మెరుగుపరుస్తుంది. హానికర విష వ్యర్థాల నుంచి కళ్ళను కాపాడుతుంది. ఈ పండ్లను మీరు మార్కెట్‌లో లేదా ఈ-కామర్స్ సైట్లలో డ్రైఫ్రూట్స్ రూపంలో పొందగలరు. ఈ పండులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన దంతాలు, ఎముకలను బలంగా చేయగలదు. మనం జలుబు, దగ్గు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ వంటి సాధారణ వ్యాధులతో పోరాడటానికి ఈ నల్ల ఎండు ద్రాక్ష సహాయపడుతుంది. అయితే బ్లాక్ కలర్ గ్రేప్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

నల్లద్రాక్ష ఎంతో రుచిగా ఉంటుంది. వీటిని చాలా మంది ఇష్ట పడి మీర తింటారు. కేవలం రుచి మాత్రమే కాకుండా.. నల్ల ద్రాక్షతో ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మానికి, జుట్టుకు అవసరం అయిన అనేక పోషకాలు ఉన్నాయి. ఈ చిన్న నల్ల ద్రాక్సలు యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాల పవర్ హౌస్ లు అని చెప్పొచ్చు. చర్మాన్ని, జుట్టుకు అవసరం అయిన బలాన్ని అందిస్తాయి. గ్లోయింగ్ స్కిన్:- నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మాన్ని కలిగించే నష్టాన్ని నివారిస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.

అంతే కాకుండా యూవీ కిరణాల నుంచి చర్మాన్ని ఈ యాంటీ ఆక్సిడెంట్లు రక్షిస్తాయి. దీంతో స్కిన్ కాంతి వంతంగా ఉంటుంది. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్:-నల్ల ద్రాక్సలో ఉండే అధిక స్థాయి పాలీ ఫెనాల్స్ శక్తివంతమైన యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ లను అందిస్తాయి. ఈ సమ్మేళనాలు చర్మంపై ఉండే గీతలు, ముడతలు, మచ్చలను తగ్గించడంలో సహాయ పడతాయి. అలాగే చర్మాన్ని సాఫ్ట్ గా ఉంచుతుంది. మీ ఆహారంలో నల్ల ద్రాక్షను చేర్చుకోవడం వల్ల మరింత యంగ్ గా కనిపిస్తారు.

జుట్టుకు పోషణ అందిస్తుంది:- నల్ల ద్రాక్షలో విటమిన్ సి, ఐరన్ తో పాటు అనేక విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. వీటిని తీసుకుంటే.. జుట్టు పెరుగుదలకు కూడా సహాయ పడతాయి. నేచురల్ ఇవి జుట్టు ఆకృతిని మెరుగు పరుస్తాయి. అదే విధంగా జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. నల్ల ద్రాక్షను తీసుకుంటే జుట్టు బలంగా తయారవుతుంది. హార్ట్ హెల్త్:- నల్ల ద్రాక్షలో అధిక స్థాయిలో రెస్వెరాట్రాల్ ఉండటం వల్ల గుండెకు చాలా అనుకూలంగా ఉంటుంది. రెస్వెరాట్రాల్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకుంటే.. రక్త పోటు స్థాయిలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈ విధంగా నల్ల ద్రాక్ష తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయ పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:-నల్ల ద్రాక్షలో విటమిన్ సి ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. దీంతో అంటు వ్యాధులు రాకుండా పోరాడేందుకు రోగ నిరోధక శక్తి తోడ్పడుతుంది. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకుంటే సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. అలాగే రకరకాల ఇన్ ఫెక్షన్ లకు దూరంగా ఉండొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker