Health

రక్తం గడ్డ కడుతుందా..! వీటిని తింటే రక్తనాళాలలోని క్లాట్స్ అన్ని కరిగిపోతాయి.

మీ శరీరం ఎప్పుడూ రక్త శ్రావం జరగకుండా రక్షింప బడుతుంది. చాలా సందర్భాలలో రక్తం గడ్డ కట్టడం మంచిదే. అయితే కొన్ని సందర్భాలలో రక్తం గద్దకట్టడం కూడా ప్రామాదకరమే.ఈ విష యం లో మాత్రం అప్రమత్తం గా ఉండాలి. కొన్ని కారణాల వల్ల అంటే మీ గుండె హార్ట్ బీట్ అంటే మీ గుండె కొట్టుకోవడంలో ఒక్కోసారి తక్కువగా మరోసారి ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. అయితే హార్ట్ ఎటాక్.. చిన్న, పెద్ద.. వయసుతో సంబంధం లేకుండా క్షణాల్లోనే గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది.

పోస్ట్ కోవిడ్ సమస్యలు కారణమని కొందరు వైద్యులు చెబుతున్నారు. కానీ ఒత్తిడి, గంటల తరబడి ఒకే ప్లేస్ లో కూర్చుని పనిచేయడం, అధిక బరువు, డయాబెటీస్, నిద్రలేమి కూడా గుండెపోటుకు కారణం కావొచ్చు. అంతేకాదు రీరంలో ప‌లు చోట్ల ర‌క్త నాళాల్లో క్లాట్స్ ఏర్ప‌డ‌డం వ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్ లు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఉదయాన్నే పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి. నేరుగా తినలేకపోతే.. తేనెతో కలిపి తినొచ్చు. ఇలా తినడం వల్ల రక్తసరఫరా మెరుగవ్వడంతో పాటు అక్కడక్కడా ఏర్పడిన రక్తపు గడ్డలు కూడా నిదానంగా కరిగిపోతాయి. హైబీపీ కూడా తగ్గుతుంది. రోజూ ఒక కప్పు నల్లద్రాక్షలను తినడం లేదా.. ఒక గ్లాస్ ద్రాక్షజ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో ఏర్పడిన క్లాట్స్ ను కరిగిస్తాయి. రోజూ ఒక 60 ఎంఎల్ రెడ్ వైన్ తాగితే క్లాట్స్ కరిగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిని ఆల్కహాల్ గా ఏమాత్రం పరిగణించకండి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది. కానీ చాలా కాస్ట్లీ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా గుండెను సంరక్షిస్తాయి. రోజూ రాత్రి వేళలో ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే చాలు.

రక్తనాళాల్లో ఏర్పడిన క్లాట్స్ కరిగిపోతాయి. రెండుపూటలా భోజనానికి ముందు ఒక టీ స్పూన్ అల్లం రసం తీసుకుంటే.. రక్తనాళాల వాపులను తగ్గిస్తుంది. అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. కివీ, పైనాపిల్ పండ్లతో పాటు పాలకూర వంటి ఆకుకూరలను ఆహారంగా తరచూ తీసుకుంటూ ఉంటే క్లాట్స్ ను కరిగించడంలో సహాయపడుతాయి. ఫలితంగా గుండెపోటు రాకుండా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker