Health

ఈ పండ్లు తింటుంటే చాలు, సహజంగా శరీరంలో హిమోగ్లోబిన్ భారీగా పెరుగుతుంది.

శరీరం చుట్టూ ఆక్సిజన్‌ను తీసుకెళ్లడంతో సాయపడుతుంది. ఆక్సిజన్‌ను రవాణా చేయడంతో పాటు హిమోగ్లోబిన్ కార్బన్ డై ఆక్సైడ్‌ను ఎర్రరక్త కణాల నుంచి ఊపిరితిత్తుల్లోకి తీసుకువెళ్తుంది. శరీరంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవడం, కొత్తగా తయారయ్యే వాటికంటే ఎక్కువ ఎర్ర రక్తకణాలు నశించిపోవడం, ఏదైనా ఆరోగ్యసమస్య వల్ల ఎక్కువగా రక్తం పోవడం వంటి కారణాల వల్ల హిమోగ్లోబిన్‌ తక్కువగా తయారవుతుంది. అయితే హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్. శరీరం మొత్తానికి ఆక్సిజన్ తీసుకువెళటం రక్త కణాల పని. తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిల వల్ల శరీరం యొక్క పనితీరుపై ప్రభావం పడుతుంది.

హిమో గ్లోబిన్ దగ్గతే రక్తహీనత తోపాటు, కాలేయం, మూత్రపిండాల పనితీరుపై ప్రభావంపడుతుంది. హిమోగ్లోబిన్ లోపం కారణంగా అలసట, బలహీనత, కామెర్లు, తరచుగా తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. హిమోగ్లోబిన్ స్థాయిలను సహజంగా పెంచేందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి. బీట్‌రూట్‌లో ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్ మరియు విటమిన్‌లు B1, B2, B6, B12 మరియు C పుష్కలంగా ఉన్నాయి. ఇవి హిమోగ్లోబిన్ కౌంట్‌ని పెంచడానికి ,ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి దోహదపడతాయి.

కూరగాయలు, సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. మునగ ఆకులలో జింక్, ఐరన్, కాపర్, మెగ్నీషియం మరియు విటమిన్ ఎ, బి మరియు సి వంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ మూలకాలన్నీ ఐరన్, హిమోగ్లోబిన్ , ఎర్ర రక్త కణాలకు అవసరం. ఈ ఆకులను బెల్లం కలిపి తీసుకుంటే మరిన్ని లాభాలు పొందవచ్చు. వైద్యుల సలహాతో దాని రసం త్రాగవచ్చు. లేదా గింజలను కూరగా చేసుకుని తీసుకోవచ్చు. బచ్చలికూర, ఆవాలు, సెలెరీ ,బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చి ఆకుల్లో ఉండే విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఇతర పోషకాలు హిమోగ్లోబిన్‌ను పెంచడానికి పని చేస్తాయి.

క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రోకలి ఐరన్ , బి-కాంప్లెక్స్ విటమిన్ ఫోలిక్ యాసిడ్ మంచి మూలం. మెగ్నీషియం, విటమిన్ ఎ మరియు సి వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఐరన్, హిమోగ్లోబిన్ కౌంట్ పెరగాలంటే ఉడికించి తినవచ్చు. సలాడ్ రూపంలో లేదా కూరగాయల రూపంలో తీసుకోవచ్చు. దానిమ్మ ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు,ఫైబర్ అలాగే కాల్షియం, ఇనుము వంటి వాటికి మూలం. హిమోగ్లోబిన్ పెరగడమే కాకుండా ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఐరన్,హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ప్రతిరోజూ దానిమ్మ రసం త్రాగాలి. తక్కువ హిమోగ్లోబిన్ కారణాలు,

లక్షణాలు.. తక్కువ హిమోగ్లోబిన్‌కు అనేక కారణాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఆహారంలో ఇనుము ,విటమిన్ B-12 లోపం, రక్త క్యాన్సర్, మూత్రపిండాలు , కాలేయ వ్యాధి, థైరాయిడ్, తలసేమియా, ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా వ్యాధి కారణం కావచ్చు. హిమోగ్లోబిన్ లోపం లక్షణాలు..గుండె దడ, చర్మం పసుపు రంగులోకి మారడం, చిగుళ్ళలో రక్తస్రావం, అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది, కండరాల బలహీనత, అలసటతో నిరంతర, తలనొప్పి, శ్వాస ఆడకపోవుట. ఇలా వివిధ లక్షణాలు హిమోగ్లోబిన్ లోపం కారణంగా కనిపిస్తాయి. ఈ సమయంలో వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker