Health

బొప్పాయి తిన్న వెంటనే ఈ పనులు చేస్తే మీ ఆరోగ్యం రిస్క్ లో పడ్డట్లే..?

తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పపెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే. మనం తినే ఆహారాల్లో బొప్పాయి కూడా ఒకటి. సిటీల్లో అయితే వీటిని కొనుక్కుని తింటారు కానీ.. పల్లెటూర్లలో అయితే బొప్పాయి చెట్లు చాలా ఉంటాయి.

ముఖ్యంగా వేసవి కాలంలో వీటికి డిమాండ్ ఎక్కువ. బలవర్థకమైన పదార్థాల్లో బొప్పాయి కూడా ఒకటి. అదే విధంగా శరీరానికి చలవ కూడా చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం బొప్పాయిని వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. అయితే బొప్పాయి తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదట. దీని వల్ల శరీరానికి పలు రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పాల ఉత్పత్తులు:- బొప్పాయి పండు తిన్న వెంటనే పాలు, పెరుగు, జున్ను, పాల ఉత్పత్తులు తీసుకోకూడదు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను గ్రహించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత వీటికి దూరంగా ఉండాలి. లేదంటే జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. అంతే కాకుండా గ్యాస్, మలబద్ధకం, పొట్టలో వాపు వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గుడ్లు:- బొప్పాయి తిన్న తర్వాత గుడ్లను కూడా తీసుకోకూడదు. అలాగే ఎగ్స్ తో తయారు చేసిన ఆహారాన్ని కూడా తీసుకోకూడదు.

ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్తి, పొట్ట సమస్యలు, వికారం వంటి వాటిని ఎదుర్కొనాల్సి వస్తుంది. మరి కొంత మందిలో అయితే వాంతులు కూడా అవ్వొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కూలింగ్ వాటర్:- సాధారణంగా ఏ పదార్థం తిన్నా వెంటనే నీరు తాగుతూ ఉంటారు. అలా బొప్పాయి తిన్న తర్వాత కూలింగ్ వాటర్ అస్సలు తాగ కూడదట. ఇలా తాగడం వల్ల బొప్పాయిలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. అంతే కాకుండా జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

ఫ్రూట్ సలాడ్:- బొప్పాయి తిన్న వెంటనే ఫ్రూట్ సలాడ్ కి కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయి పండును తిన్న తర్వాత ఇతర పండ్లతో తయారు చేసిన సలాడ్ ను తినడం వల్ల జీర్ణ క్రియ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది అరగడానికి సమయం పడుతుంది. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker