Health

ఈ లక్షణాలు చాలా డేంజర్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం, నిర్లక్ష్యం చేసారంటే..?

రక్తం గడ్డ కట్టడంతో రక్తనాళం మూసుకుపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం ద్వారా మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితిని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు.బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా అధిక రక్త పోటుతో బాధపడేవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ధూమపానం అలవాటు అధికంగా ఉన్నవారు స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, కాలుష్యం వంటి కారణాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.

అయితే ఈ స్ట్రోక్ చేతుల్లోని కదలికను నియంత్రించే మొదడులోని భాగాన్ని ప్రభావితం చేస్తుందట. చేతిలో వచ్చే ఈ బలహీనత సాధారణంగా శరీరానికి ఒకవైపు మాత్రమే వస్తుంది. ఇది కొంచెం నుంచి ఎక్కువగా అవుతుంటుంది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో అడ్డుపడడం లేదా మెదడులోని రక్తనాళాల చీలిక వల్ల ఈ స్ట్రోక్ వస్తుందని తెలుస్తోంది.

తిమ్మిరి.. ముఖం చేయి లేదా కాలుకు ఒక వైపున సంభవించే అవకాశాలు ఉంటాయి. అకస్మాత్తుగా శరీరంలో ఒక సైడు కదలిక పోతుంది. మాటలో తడబాటు..మాట్లాడడంలో తడబాటు, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, స్పష్టంగా మాటరాకపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. నడకలో ఇబ్బంది.. సమన్వయం కోల్పోవడం, నేరుగా నడవలేకపోవడం, ఆకస్మిక మైకం వంటి సంకేతాలు.

తలనొప్పి.. కారణం లేకుండానే అధిక తలనొప్పి స్ట్రోక్ కు సంకేతం. ఇతర లక్షణాలు ఏమైనా ఉంటే జాగ్రత్త పడాలి. కంటి చూపు మసకబారడం, రెండుగా ప్రతిబింబం కనిపించడం, కంటి దృష్టి అస్పష్టంగా అనిపించడం స్ట్రోక్ కు కంకేతాలు. ముఖం పక్కకు వంగడం: ముఖంలోని ఒక భాగం ఒక వైపుకు వంగడం, మొద్దుబారడం, తిమ్మరి రావడం వంటివి బ్రెయిన్ స్ట్రీక్ లక్షణాలే. నవ్వడానికి ప్రయత్నిస్తే.. అప్పుడు స్పర్శ తెలియకపోవడం మెయిన్ లక్షణం.

మింగడం కష్టం.. నోరు, గొంతు కండరాల్లో బలహీనత. మింగడం, నియంత్రించడంలో కష్టంగా అనిపించడం కూడా బ్రెయిన్ స్ట్రోక్ కు లక్షణం అంటున్నారు నిపుణులు. ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నా.. ఎవరిలో అయినా మీరు గమనించినా.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఈ స్ట్రోక్ ముదిరితే వ్యాధి నుంచి బయట పడడం చాలా కష్టం. వెంటనే గుర్తించి వైద్యం అందుకుంటే దీని నుంచి నయం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker