Health

వీటిని తరచూ తింటుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.

ఇవి మన శరీరంలో మంటలు, వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. గుండెను కాపాడతాయి. చర్మానికి రక్షణ కల్పిస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. టెన్షన్ నుంచీ ఉపశమనం కలిగిస్తాయి. వీటిని తింటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మగాళ్లలో స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు కూడా ఇవి దోహదపడతాయి. అయితే ఇటీవల కాలంలో.. డైట్ పేరుతో నట్స్ తినడం అలవాటు చేసుకుంటున్నాం.

మొలకెత్తిన విత్తనాలతో పాటు.. నానబెట్టిన నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. నట్స్ అంటే ఇప్పుడు కేవలం బాదం, పిస్తా, జీడిపప్పే కాదు.. ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో రకరకాల నట్స్ వచ్చేశాయి. వాటిలో ఒకటి బ్రెజిల్ నట్స్. పేరులో ఉన్నట్టుగా ఇవి బ్రెజిల్ దేశం నుంచే దిగుమతి అవుతాయి.

అక్కడ ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి ఈ బ్రెజిల్ నట్స్ ను సేకరిస్తారు. బ్రెజిల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు సెలీనియం కూడా పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్, మెగ్నీషియం, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. 6 బ్రెజిల్ నట్స్ లో సుమారు 185 కేలరీలు ఉంటాయి. అంటే ఇవి లో కేలరీ ఫుడ్ అనమాట.

అలాగే 4 గ్రాముల ప్రొటీన్, 3 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 19 గ్రాముల కొవ్వు ఉంటాయి. బ్రెజిల్ నట్స్ లో లభించే సెలీనియం రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని నివారిస్తుంది. రోజుకి ఒకటి లేదా రెండు బ్రెజిల్ నట్స్ తింటే చాలు.

బాదంపప్పు కంటే పెద్ద పరిమాణంలో ఉండే ఈ నట్స్.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటీవిటీని మెరుగుపరుస్తాయి. బ్రెజిల్ నట్స్ ఎక్కువగా, అలాగే పచ్చిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఉడికించి లేదా ఒక రాత్రంతా తినడమే ఆరోగ్యకరమని సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker