Health

క్యాన్సర్‌కు అవసరమైన టాబ్లెట్ వచ్చింది, డాక్టర్లు ఏం చెప్పారంటే..?

ప్రపంచ వ్యాప్తంగా, ఏటా కోటి మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. మన దేశంలో, ప్రతి సంవత్సరం సుమారు పదకొండు లక్షల మందికి క్యాన్సర్ సోకినట్లుగా నిర్ధారణ అవుతోంది. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, కడుపు క్యాన్సర్ వీటిలో మొదటి వరుసలో ఉంటున్నాయి. అయితే అమెరికా పరిశోధకులు.. క్యాన్సర్ నివారణకు ఓ మాత్ర ని తయారుచేశారు. ఇది క్యాన్సర్‌ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు. దీన్ని AOH1996 అని పిలుస్తున్నారు.

“ఇది అన్ని బలమైన క్యాన్సర్ కణతులనూ చంపుతుంది” అని పరిశోధకులు.. ప్రారంభ క్లినికల్ రీసెర్చ్ తర్వాత తెలిపారు. ఈ మందుబిళ్లకు ఈ పేరు పెట్టడం వెనక ఓ కారణం ఉంది. నిజానికి ఇది అన్నా ఒలివియా హేలే పేరు. 2005లో.. 9 ఏళ్ల వయసులో.. ఒలివియా.. న్యూరోబ్లాస్టోమాతో చనిపోయింది. ఇది పిల్లలకు వచ్చే క్యాన్సర్. అమెరికాలో ఏటా 600 మంది పిల్లలకు ఇది వస్తోంది. ఒలివియా.. అమెరికా.. ఇండియానాలో 1996లో పుట్టింది. ఈ డ్రగ్‌పై.. కాలిఫోర్నియా.. సిటీ ఆఫ్ హోప్ హాస్పిటల్‌లో.. ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ చేసినట్లు సైంటిస్టులు తెలిపారు.

“ఆ బాలిక కోసం ఏదైనా చెయ్యాలనుకున్నాం.” అని ఆస్పత్రిలోని ప్రొఫెసర్ లిండా మాల్కస్ తెలిపారు. అందుకే ఆ బాలిక పేరును ఈ మాత్రకు పెట్టామన్నారు. పాప చనిపోక ముందు.. అమె కుటుంబ సభ్యులను డాక్టర్ లిండా మాల్కస్ కలిశారు. “అన్నాకి క్యాన్సర్ చివరి దశల్లో ఉన్నప్పుడు.. నేను ఆమె తండ్రిని కలిశాను. న్యూరోబ్లాస్టోమా నివారణకు మేము ఏదైనా చెయ్యగలిగితే.. అందుకు తాను 25000 డాలర్లు ల్యాబ్‌కి ఇస్తానని ఆయన అన్నారు. ఆ క్షణం ఏదైనా చెయ్యాలని అనుకున్నాను. ఆ దిశగా మా ప్రయత్నాలు సాగాయి” అని డాక్టర్ లిండా మాల్కస్ న్యూయార్క్ పోస్ట్‌కి తెలిపారు.

అమెరికా క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. న్యూరోబ్లాస్టోమా అనేది.. నరాల కణాల కు వ్యాపిస్తుంది. కొన్నిసార్లు పిండంలో వ్యాపిస్తుంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత AOH1996ని తయారుచేశారు. ఇది PCNAని లక్ష్యంగా చేసుకుంటుంది. క్యాన్సర్ కణితులు సరైన విధంగా మారేలా చేస్తుందని అంటున్నారు. “ఈ డ్రగ్.. మంచి కణాలను టచ్ చెయ్యదు. క్యాన్సర్ కణాల్లోని PCNAని మాత్రమే టచ్ చేస్తుంది. PCNA అనేది క్యాన్సర్ కణాల్లో ప్రత్యేక మార్పులతో ఉంటుంది.

అందువల్ల మేము PCNAని మాత్రమే లక్ష్యంగా చేసుకునే మందును తయారుచేశాం” అని డాక్టర్ మాల్కస్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ డ్రగ్.. న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్‌ని తగ్గిస్తోంది అంటున్నారు. అందువల్ల భవిష్యత్తులో బ్రెస్ట్, ప్రొస్టేట్, బ్రెయిన్, ఒవేరియన్, సర్వైకల్, స్కిన్, లంగ్ కేన్సర్లను కూడా నివారించే మందులు వస్తాయనే ఆశలు కలుగుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker