Health

గుండెపోటుతో చావును చూసి, తిరిగొచ్చిన రోగులు ఏం చెప్పారో తెలుసా..?

అలసట, ఒత్తిడి కారణంగా గుండె వైఫల్యం. గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కనుక రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఎలక్ట్రోఎన్సేఫలోగ్రామ్(EEG) స్కాన్ ప్రకారం గుండె ఆగిపోయిన ఒక గంట తర్వాత వైద్యులు సీపీఆర్ నిర్వహిస్తారు. అటువంటి సమయంలో మెదడు కార్యకపాల సంకేతాలని గుర్తించారు. గుండెకి ఆక్సిజన్ సరఫరా చేయడం ఆగిపోయిన 10 నిమిషాల తర్వాత మెదడు శాశ్వతంగా దెబ్బతింటుందని అనుకుంటారు. కానీ అది అవాస్తవమని పరిశోధకులు కనుగొన్నారు.

సీపీఆర్ చేసిన సమయంలో విద్యుత్ సంకేతాలు మెదడుకి పంపిస్తాయి. ఈ అధ్యయనంలో మే 2017 నుంచి మార్చి 2020 మధ్య గుండె ఆగిపోయిన తర్వాత సీపీఆర్ చికిత్స తీసుకుని బతికిన యూఎస్ కి చెందిన 25 మందిని, యూకేకి చెందిన 567 మంది రోగులని పరీక్షించారు. ప్రాణాలతో బయట పడిన 53 మందిలో 28 మందిని ఇంటర్వ్యూ చేసి పలు విషయాలు తెలుసుకున్నారు. కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, వాళ్ళకి మనసులో ఏం కనిపించింది అనేది అడిగి తెలుసుకున్నారు.

“నా ఛాతీపై ఎవరో ఏదో చేస్తున్నట్టు అనిపించింది. ఆ కుదుపులు భరించలేకపోయాను. గట్టిగా రుద్దుతున్నట్టు అనిపించింది. అది చాలా బాధకరమైన పరిస్థితి” అని ప్రాణాలతో బయట పడిన ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఒక మత్స్యకారుడు వర్షం పడుతుంటే సముద్రం దగ్గర నిలబడి పాట పాడుతున్నట్టుగా తనకి కనిపించిందని మరొకరు చెప్పారు. “నేను నా శరీరంలో లేను. బరువు లేకుండా భౌతికంగా తేలుతున్నాను. చికిత్స చేస్తున్న ఇంటెన్సివ్ థెరపీ గదిలో ఉన్నాను. నాకు ఏం చేస్తున్నారో అదంతా నేను చూడగలగుతున్నాను” అని మరొకరు వెల్లడించారు.

గుండె ఆగిపోయిన గంట తర్వాత కూడా వాళ్ళు స్పృహలోనే ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. “నా జీవితంలో జరిగిన విషయాలు మొత్తం ఒక్కసారిగా కళ్ల ముందుకు వచ్చాయి. ప్రేమ, ఆనందం, బాధ అంతా కలిగింది. నేను మాట్లాడిన ఎంతో మంది వ్యక్తులు కనిపించారు” అని ఇంకొకరు చెప్పుకొచ్చారు. మరికొంతమంది మాత్రం తాము ప్రేమించిన వ్యక్తులు కళ్ల ముందు కనిపించినట్టు గుర్తు చేసుకున్నారు. సీపీఆర్ చేస్తున్న సమయంలో కనిపించిన దృశ్యాలు, శబ్దాలు గుర్తు తెచ్చుకోగలరా లేదా అనేది కూడా పరిశోధకులు పరీక్షించారు.

అందుకోసం వారికి హెడ్ ఫోన్స్ పెట్టి 10 చిత్రాలు చూపించారు. ఆపిల్, పియర్, అరటి పండు అనే మూడు పదాలు ప్లే చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 28 మందిలో ఒకరు మాత్రమే పదాల క్రమాన్ని సరిగ్గా గుర్తుంచుకున్నారు కానీ చిత్రాలు మాత్రం గుర్తు పట్టలేకపోయారు. కార్డియాక్ అరెస్ట్ నుంచి బయట పడిన వ్యక్తుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనే దాని మీద మరింత విస్తృతంగా పరిశోధన చేయాల్సి ఉందని నిపుణులు భావించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker