News

ఈ అలవాట్లు ఉంటే త్వరగా చనిపోతారు, చాణక్యుడు చెప్పిన ఆ అలవాట్లు ఏంటో తెలుసుకోండి

ఇతడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడి తండ్రి పేరు చణకుడు. ఆయన స్వయంగా అధ్యాపకుడు కావడం వల్ల విద్య యొక్క విలువ బాగా తెలుసు. తక్షశిల అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వ విద్యాలయం. చాణక్యుడు చిన్నవాడిగా ఉన్నప్పుడే వేదాలు చదవడం ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల యువతలో తొందరగా వృద్దాప్యం వస్తుంది. వెంట్రుకలు తెల్లబడటం, శారీరక బలహీనత, తరచూ అనారోగ్యం వంటివి వస్తున్నాయి.

అయితే మనుషులు తొందరగా ముసలి వారు ఎందుకు అవుతారో తెలిపాడు చాణక్యుడు. ఆహారపు అలవాట్లు పాటించకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది. ప్రయాణ అలసట, క్రమరహిత జీవనశైలి వల్ల ప్రజలు త్వరగా వృద్ధులు అవుతారు. అంతేకాదు భర్త నుంచి శారీరక సుఖం స్త్రీలు కూడా త్వరగా వృద్ధులు అవుతారని అన్నారు చాణక్యుడు. మనుషులే కాదు గుర్రాలు కూడా త్వరగా ముసలివి అయిపోతాయట. నడవడం, పరుగెత్తడం వంటివి చేయకుండా ఉంటే కచ్చితంగా గుర్రాలు కూడా తొందరగా ముసలివి అవుతాయట.

గుర్రాన్ని కట్టి వేయడం వల్ల భౌతిక స్వభావానికి విరుద్ధంగా ఉండి.. బలం తగ్గి, బలహీనపడుతాయట. మనిషి కూడా అంతే పనిచేయకుండా ఉంటే త్వరగా ముసలి వారు అవుతారన్నాడు చాణక్యుడు. మానసిక ప్రశాంతం మనిషికి చాలా అవసరం, ఎప్పుడూ ఒత్తిడిలో ఉండేవారికి కూడా వృద్ధాప్యం త్వరగా వస్తుంది. వయసు పెరుగుతున్నా, మానసికంగా చిన్నపిల్లలుగా ఉంటే అప్పుడే శరీరం బాగుంటుంది. చెడు అలవాట్లు ఉంటే ఎక్కువ కాలం జీవించరని చెబుతున్నాడు చాణక్యుడు.

అతిగా తిన్నవారు త్వరగా పేదలుగా మిగులుతారు. అంతే కాదు అతిగా ఆహారం తీసుకుంటే పేదరికానికి దారి తీస్తుందట. అలాంటి వ్యక్తులు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. దీంతో ఆస్పత్రులకు ఖర్చు చేయాల్సిందే. అంతేకాదు ఇలాంటి వారు కూడా ఎక్కువ కాలం జీవించరట. చెడు అలవాట్లు ఉంటే కూడా ఎక్కువ కాలం జీవించరట.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker