News

సునిశిత్ ని చితకబాదిన చరణ్ ఫ్యాన్స్, తర్వాత డబ్బులు ఎందుకు ఇచ్చారో తెలుసా..?

ఇటీవల రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మీద అనుచిత కామెంట్స్ చేశాడు. ఉపాసన నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమెతో నేను గోవా ట్రిప్ కి వెళ్ళాను. రామ్ చరణ్ కూడా నాకు మిత్రుడే. ఉపాసనను లవ్ లో దింపాలని నాకు చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రామ్ చరణ్ ఫ్యాన్స్… సునిశిత్ కి దేహశుద్ధి చేశారు. మీడియా ముందు క్షమాపణలు చెప్పించారు. ఆ వీడియో వైరల్ గా మారింది.

అయితే తనకు లావణ్య త్రిపాఠితో ఎఫైర్ ఉండేది అంటూ గతంలో సునిశిట్ చేసిన కామెంట్స్ మీద ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కొంతకాలం జైల్లో పడేసారు. అదే సమయంలో నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోగా సుకుమార్ నన్నే తీసుకున్నారు. అలాగే స్టార్ హీరోల సినిమాలు అన్ని కూడా నేనే చేయాల్సింది అంటూ గాలి మాటలు చెబుతూ ఉంటే వాడితో యుట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేస్తూ పాపులర్ చేసేశాయి.

అతను కామెంట్స్ చేయని హీరో, హీరోయిన్స్ లేరనే అతిశయోక్తి కాదు. అవన్నీ అబద్దాలు అని తెలిసిన యుట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం చేస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్, ఉపాసన మీద ఓ ఇంటర్వ్యూలో కాస్తా శృతి మించి మాట్లాడాడు. దీంతో తాజాగా చరణ్ అభిమానులు అతనిని ఓ చోట పట్టుకొని వీర లెవల్ లో చితక్కొట్టారు.

గట్టిగా బాదిన తర్వాత కెమెరా ముందుకి తీసుకొచ్చి చరణ్, ఉపాసన మీద చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఇక అతనిని కొట్టడమే కాకుండా పోలీసులకి కూడా అప్పగించి కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇన్ని రోజులు అతని హీరో, హీరోయిన్స్ మీద ఇష్టానుసారంగా చేసిన ప్రేలాపనలకి ఇప్పుడు చెర్రి అభిమానులు గట్టిగానే బుద్ధి చెప్పారనే మాట వినిపిస్తోంది.

అయితే కొంత మంది అలా కొట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అతను మానసికరోగి అని, వాడితో వ్యూస్ కోసం ఇంటర్వ్యూలు చేస్తున్న యుట్యూబ్ ఛానల్స్ పై ఎటాక్ చేయాలి కాని అతని మీద కాని ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker