Health

చేదుగా ఉన్న బాదంపప్పులు తింటున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఫాస్పరస్, రాగి నిండి ఉంటాయి. అందుకే వీటిని శక్తివంతమైన గింజలు అని అంటారు. అయితే బాదం పప్పుల్లో చేదువి కూడా ఉంటాయి. సాధారణ వాటి మాదిరిగానే ఇవి కూడా వాటిని పోలి ఉంటాయి. అందుకే వాటిని గుర్తించడం కష్టం. తిన్న తర్వాత మాత్రమే రుచిని బట్టి తెలుసుకోగలుగుతారు. రోజూ బాదంపప్పు తింటే.. ఆరోగ్యానికి మంచిదంటారు. డైలీ నానపెట్టిన బాదంపప్పులు గుప్పెడు తింటే చాలు.. గుండె పదిలం అంటారు. ఇంకా ఎన్నో లాభాలు.. బాదంపప్పు తింటే శరీరానికి సరైన పోషణ అందుతుంది. శక్తిని ఇవ్వడంతో పాటు మెదడుకి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

అయితే పోషకాలు ఉన్నప్పటికీ.. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఫాస్పరస్, రాగి ఉంటాయి. అందుకే వీటిని శక్తివంతమైన గింజలు అని అంటారు. అయితే బాదంపప్పుల్లో చేదువి కూడా ఉంటాయి. మంచి బాదంపప్పుల్లానే ఇవి కూడా ఉంటాయి.. అందుకే వాటిని గుర్తించడం కష్టం. తిన్న తర్వాత మాత్రమే రుచిని బట్టి తెలుసుకోగలుగుతారు. మామూలు బాదం మాదిరిగానే వాటిలోని పోషకాలు ఉంటాయి. కానీ మరి చేదు ఎందుకు ఉంటుందంటే.. అందులో కొద్ది మొత్తంలో అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది శరీరం తీసుకున్నప్పుడు సైనెడ్‌గా మారిపోతుంది.

అందుకే చేదు బాదం తీసుకోవడం విషపూరితం అవుతుంది. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఒక వేళ మీరు బాదం తినేటప్పుడు చేదు తగిలితే వాటిని మింగకుండా బయటకి ఉమ్మివేయడం మంచిది. అధ్యయనాలు ఏం చెప్తున్నాయి. 2011లో క్లినికల్ టాక్సికాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పది మందితో కూడిన ఒక బృందం పరిశోధనలు చేసింది. చేదుబాదం తీసుకోవడం వల్ల శరీరంలో సైనైడ్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా వికారం, వాంతులు, తల తిరగడం, తలనొప్పి ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎక్కువ మొత్తంలో చేదు బాదం తీసుకుంటే ప్రాణాంతకం అవుతుందని సదరు అధ్యయనం నిర్థారించింది. 2009లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ ప్రచురించిన జర్నల్ కూడ ఇదే విషయాన్ని వెల్లడించింది. చేదు బాదంలో వివిధ పరిమాణంలో ఉంటుందని వాటిని తీసుకోవడం నిజంగా హానికరమని అధ్యయనం చెప్పుకొచ్చింది. ఈ రకం బాదంలు మంచివి..కాలిఫోర్నియా, షాలిమార్, గుర్బంది, ప్రన్యాజ్, ముఖ్దూమ్, మమ్రా, కాగ్జి వంటివి అత్యంత ప్రసిద్ధి బాదం రకాలు.

నానబెట్టిన బాదంను పాలుగా చేసుకోవచ్చు. పేస్ట్‌గా చేసుకుని కూరల్లో వేసుకోవచ్చు. ఇది కూరకి చిక్కదనం ఇస్తుంది. బాదం కేక్, చాక్లెట్ కోటెడ్ బాదం, బాదం కుకీలు, బాదం హల్వా, ఆల్మండ్ ఫడ్జ్, ఆల్మండ్ బ్రౌనీస్ వంటి స్వీట్ ట్రీట్‌లు వీటితో చేసుకోవచ్చు. బాదం పొడి గ్లూటెన్ రహిత పిండి. ఆల్మండ్ బటర్ ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. బ్రెడ్, శాండ్ విచ్ మీద స్ప్రెడ్ చేసుకుని తింటే రుచిగా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker