News

అలిపిరి కాలిబాట వైపే చిరుతలు ఎందుకు వస్తున్నాయో తెలుసా..? నమ్మలేని నిజాలు వెలుగులోకి..?

శ్రీవారి దర్శనానికి కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ముఖ్యంగా చిరుతల సంచారంపై ఫోకస్‌ పెట్టారు అధికారులు. చిన్నారిపై దాడి తర్వాత.. భద్రతను ఎంతో పటిష్టంగా పెంచింది. అయితే ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని భయపడాల్సిన పరిస్థితి. చిరుత పులులే అనుకుంటే వాటికి తోడు ఎలుగుబంట్లు కూడా బెంబేలెత్తిస్తున్నాయ్‌. ఓ అంచనా ప్రకారం 50కి పైగా చిరుతలు, పదికి పైగా ఎలుగుబంట్లు ఉన్నట్టు లెక్కగట్టారు.

ఈ లెక్క పక్కనబెడితే అసలు, ఈ క్రూర మృగాలు నడక మార్గాల వైపే ఎందుకొస్తున్నాయ్‌?. ఈ అనుమానమే టీటీడీకి, ఫారెస్ట్‌ అధికారులకీ వచ్చింది. దట్టమైన అడవి మధ్యన ఉండాల్సిన చిరుత పులులు, ఎలుగుబంట్లు… అసలెందుకు ఇక్కడికి వస్తున్నాయో కనిపెట్టేందుకు అధ్యయనం చేపట్టారు. ఆ స్టడీలో సంచలనం విషయం బయటపడింది.

ఇంతకీ అదేంటో చూడండి. నడక మార్గాల్లో ఉండే ఫుడ్‌ కోర్ట్స్‌, ఆ రూట్‌లో ఆహార వ్యర్ధాలను పడేయడమే అటువైపు చిరుతలు రావడానికి ప్రధాన కారణమంటున్నారు సీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి. ఎక్కడైతే ఫుడ్‌ కోర్ట్స్‌ ఉన్నాయో, ఎక్కడైతే ఆహార వ్యర్ధాలను పడేస్తున్నారో అక్కడే చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు.

ట్రాప్‌ కెమెరాల్లో కూడా అక్కడే చిరుతల సంచారం కనిపించందన్నారు. ఆహార వ్యర్ధాలను తినేందుకు వస్తోన్న జంతువుల్ని ఈజీగా వేటాడేందుకే చిరుతలు, ఎలుగుబంట్లు అక్కడికి వస్తున్నట్టు చెప్పారు. అందుకే, కాలిబాటలో ఆహార పదార్ధాలను పడేయకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుతం 500 లకు పైగా హైక్వాలిటీ ట్రాప్‌ కెమెరాలతో మానిటరింగ్‌ జరుగుతోందని, త్వరలో ఎలివేటెడ్‌ వాక్‌వేస్‌, ఏరియల్‌ ఫుట్‌పాత్స్‌ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. మరో చిరుత సంచారాన్ని గుర్తించామన్నారు. అయితే, లక్షితపై దాడిచేసిన చిరుతను బంధించేవరకు ఆపరేషన్‌ కొనసాగుతుందన్నారు సీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker