Health

చెవి పోటు ఎక్కువగా ఉన్నపుడు ఈ పొడిని నూనెకి కలిపి చెవిలో వేస్తె చాలు.

చెవిలో ఇన్ఫెక్షన్ లు ఉన్నప్పుడు కూడా చెవి నొప్పి బాధిస్తుంది. వర్షంలో తడటం వల్ల కూడా తీవ్రమైన చెవి నొప్పి, చెవులు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. జలుబు, గొంతు నొప్పి, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చెవి నొప్పికి దారి తీస్తుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటే వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఈ టిప్స్ పాటిస్తే చాలు. అయితే చెవి పోటుతో బాధపడుతున్న వారు వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.

వీటిని ఫాలో అయితే చెవిపోటు తగ్గే అవకాశం ఉంది. తులసి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఎక్కువ. చెవిపోటు వస్తున్నప్పుడు తులసి ఆకుల నుంచి రసాన్ని తీసి చెవిలో వేయాలి. ఇలా వేయడం వల్ల చెవిపోటు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఇంట్లో లవంగాలు ఉంటాయి. అలాగే లవంగా నూనెను కూడా ఇంట్లో ఉంచుకోవడం చాలా అవసరం. లవంగ నూనెను చెవిలో వేస్తే నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇంట్లో లవంగ నూనె అందుబాటులో లేకపోతే కాస్త నువ్వుల నూనెలో లవంగాలను వేసి మరిగించండి.

ఆ నూనెను చల్లార్చి వడకట్టి రెండు చుక్కలు చెవిలో వేయండి. ఇది చెవిపోటును తగ్గించడానికి సహకరిస్తుంది. నువ్వుల నూనె లేదా ఆలివ్ నూనె కూడా చెవిపోటుపై ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నది ఆయుర్వేదం. వీటిని వేడి చేసి చల్లార్చి చెవిలో రెండు చుక్కలు పోస్తే మంచి ఫలితం ఉంటుంది. చెవి పోటు ఉన్నప్పుడు చెవి బయట ప్రాంతంలో కూడా వాపు లాంటిది కనిపించే అవకాశం ఉంది. అలాంటప్పుడు వెల్లుల్లిని మెత్తగా దంచి చిన్న వస్త్రంలో చుట్టి చెవినొప్పి వస్తున్న ప్రాంతంలోని బయట వైపు ఒత్తుతూ ఉండాలి. అలాగే అల్లాన్ని కూడా తెంచి రసం తీసి ఆ ప్రాంతంలో మెల్లగా మర్దన చేయాలి.

ప్రతి ఇంట్లో యూకలిప్టస్ నూనె ఉంచుకోవడం చాలా అవసరం. ఇది ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. వేడినీళ్లలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి దానిని ఆవిరి పడితే ఎంతో మంచిది. సైనస్ వల్ల చెవిపోటు వచ్చి ఉంటే ఇలా యూకలిప్టస్ నూనెతో చేయడం వల్ల చెవిపోటు తగ్గే అవకాశం ఉంది. యూకలిప్టస్ నూనె అంటే నీలగిరి తైలం. నీలగిరి చెట్టు ఆకులను నలిపి వాసన చూస్తే జండూబామ్ లా వాసన వస్తుంది. జండూబామ్ తయారీలో నీలగిరి తైలాన్ని వాడతారు. అందుకే ఇది జలుబు, చెవి పోటుపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

తలనొప్పి వేధిస్తున్నప్పుడు నీలగిరి తైలాన్ని రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జలుబు, గొంతునొప్పి వేధిస్తున్నప్పుడు ఈ నూనెను వాసన చూస్తూ ఉంటే తగ్గే అవకాశం ఎక్కువ. నడుము నొప్పితో బాధపడేవారికి కూడా ఈ నూనె ఎంతో మేలు చేస్తుంది. దీన్ని నడుముకు పట్టించడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఒళ్లు నొప్పులుగా ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో ఏడెనిమిది చుక్కల తైలాన్ని వేసి స్నానం చేయాలి. అలా చేస్తే ఒళ్లునొప్పులు తగ్గే అవకాశం ఎక్కువ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker