Health

పిల్లలకు గుండె జబ్బులు రావొద్దంటే మీరు ఖచ్చితంగా ఈ జాగర్తలు సరిపోతుంది.

ఇద్దరు చిన్నారులు గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. మరణించిన ఒకరి వయస్సు 14 సంవత్సరాలు కాగా, మరొకరి వయస్సు 17 సంవత్సరాలు. ఇద్దరు పిల్లల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నివేదికల ప్రకారం.. జునాగఢ్ జిల్లాలోని చోర్వాడ్ సమీపంలోని కొబ్బరి పొలంలో 17 ఏళ్ల బాలుడు గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించాడు. అయితే కప్పటి జీవన శైలికి ఇప్పటి జీవన శైలికి ఎంతో తేడా ఉంది. అలాగే ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి.

దీనిమూలంగానే ప్రస్తుతం ఎన్నో రోగాల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కేవలం పెద్దలే కాదు పిల్లలు కూడా ఎన్నో ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం హార్ట్ ఎటాక్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా గత కొంత గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. డ్యాన్స్ చేస్తూ, ఆటలు ఆడుతూ, నిలబడి ఉన్నపాటుగా గుండెపోటుతో కుప్పకూలి చనిపోతున్న ఘటనలను నిత్యం మనం వార్తల్లో చూస్తేనే ఉన్నాం.

ఇలాంటి పరిస్థితిలో పిల్లలను గుండెజబ్బులు, గుండెపోటు నుంచి రక్షించడానికి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల గుండెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే చిన్న వయస్సు నుంచి కొన్ని జాగ్రత్తలను పాటించాలి.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పెద్దలలో అధిక కొలెస్ట్రాల్ కు కారణమయ్యే కొవ్వు ఫలకం బాల్యంలో ఏర్పడటం ప్రారంభమవుతుంది. కాగా ఇది వయస్సుతో పాటుగా పెరుగుతుంది. అందుకే మీ పిల్లల ఫుడ్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలను పెట్టండి. అలాగే తక్కువ కొవ్వు పాలు, పెరుగు ను కూడా ఇవ్వొచ్చు. కౌమారదశలో ఉన్న పిల్లలు చెడు అలవాట్లకు తొందరగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో స్మోకింగ్ కు ఎక్కువగా అలవాటు పడతారు పిల్లలు.

దీనికితోడు ప్రస్తుత కాలంలో యువతలో ఇ-సిగరెట్లకు అలవాటు పడ్డారు. ఇది వారి ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. మీకు తెలుసా? చిన్నవయసులోనే స్మోకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. అందుకే ఇలాంటి అలవాట్లకు మీ పిల్లల్ని దూరంగా ఉంచండి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా వీరు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం. వృద్ధాప్యంలో మీ పిల్లలకు గుండెపోటు, గుండె జబ్బులు రావొద్దంటే వాళ్లను 3-5 సంవత్సరాల వయస్సు నుంచే శారీరకంగా చురుగ్గా ఉంచాలి.

అలాగే 6-17 సంవత్సరాల పాటు ప్రతిరోజూ 1 గంట లేదా అంతకంటే ఎక్కువసేపు వ్యాయామం చేసేలా చూడాలి. వాకింగ్, రన్నింగ్ వంటివి చేయొచ్చు. ఇది వాళ్ల గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఎముకలు, కండరాలను కూడా బలోపేతం చేస్తుంది. పిల్లలకు వచ్చే ఎన్నో వ్యాధులు జెనెటిక్స్ కు సంబంధించినవే. దీనిలో అధిక రక్తపోటు ఒకటి. ఇది గుండె ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. అందుకే మీ కుటుంబంలో ఎవరికైనా అధిక రక్తపోటు ఉంటే పిల్లల రక్తపోటును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker