Health

చింతపండు గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

చింతపండు వేయని కూర అసలు రుచిగానే ఉండదు అని చెప్పడంలో సందేహం లేదు. రుచికి పుల్లగా, తీయగా ఉండే చింతపండును తినడానికి పిల్లలు కూడా ఇష్టపడతారు. అయితే చింతపండు కేవలం రుచిని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ముఖ్యంగా చింత ఆకు దగ్గర నుంచి గింజల వరకు ప్రతీదీ కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. అయితే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసం ప్రకారం.. చింతపండు గుజ్జు, విత్తనాలు, ఆకులు న్యూట్రాస్యూటికల్ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. చింతపండు గుజ్జును ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో మూలికా ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో నేచురల్ ఫైటోకెమికల్ కాంపోనెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

చింతపండు గుజ్జులో ఉండే పాలిసాకరైడ్ల నుంచి ఒక ప్రత్యేక రసాన్ని జామ్, జెల్లీ, జున్ను తయారీలో ఉపయోగిస్తారు. చింత గింజల నుంచి పెక్టిన్ తయారవుతుంది. ఎన్నో దేశాల్లో చింతచెట్టు ఆకులను రోజువారీ ఆహారంలో భాగంగా కూడా ఉపయోగిస్తారు. పోషక పదార్ధాలు.. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ప్రకారం.. చింత పండులో ఫినోలిక్, యురోనిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, టార్టారిక్ ఆమ్లం, పెక్టిన్ లు ఉంటాయి. ఈ గుజ్జులో మ్యూసిలేజ్, గ్లైకోసైడ్లు, అరబినోజ్, జిలోజ్, గ్లూకోజ్, గెలాక్టోస్ సమ్మేళనాలు కూడా ఉంటాయి.

వీటితో పాటు క్యాల్షియం, కాపర్, ఐరన్, కాడ్మియం, మాంగనీస్, ఆర్సెనిక్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్ వంటి ముఖ్యమైన మూలకాలు కూడా ఉంటాయి. చింతపండు గుజ్జులో టార్టారిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, సుక్సినిక్ ఆమ్లం అలాగే ఫార్మిక్ ఆమ్లం, అమైనో ఆమ్లాలతో సహా కొన్ని ముఖ్యమైన సేంద్రీయ ఆమ్లాలు ఉంటాయి. ఎముకల ఆరోగ్యం బలపడుతుంది.. సైన్స్ రిపోర్ట్ నేచర్ సెర్చ్ జర్నల్ లో ప్రచురితమైన ఒక పరిశోధన కథనం ప్రకారం..

చింతపండు మెగ్నీషియానికి గొప్ప మూలం. దీనిలో ఇతర మొక్కల ఆధారిత ఆహారాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల చింతపండు సారంలో 35-170 మి.గ్రా కాల్షియం ఉంటుంది. ఈ రెండు ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. బోలు ఎముకల వ్యాధి, ఎముక పగుళ్లను నివారించడానికి సహాయపడుతుంది. సైన్స్ రిపోర్ట్ నేచర్ సెర్చ్ జర్నల్ ప్రకారం.. ఎముకలపై చింతపండు గుజ్జు, విత్తనాల ప్రభావాన్ని మైసూర్ విశ్వవిద్యాలయంలో పరిశీలించారు.

దీని ప్రకారం ఈ ఔషధ మొక్కను ఇప్పటికే ఆయుర్వేదంలో ఆర్థరైటిస్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఆర్థరైటిస్ ఎముక, మృదులాస్థిని ప్రభావితం చేస్తుంది. చింతగింజల సారాలు, చింత పండు గుజ్జు మృదులాస్థి, ఎముకలను రక్షించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇది వాపును కూడా తగ్గిస్తుంది. చింతపండు హైడ్రోపెరాక్సైడ్ల పెరిగిన స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడింది. మొత్తం మీద చింతపండు మృదులాస్థి, ఎముకలలో మంట, బలహీనతను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker