News

వామ్మో, శ్రీశైలం సత్రాలకు సమీపంలో చిరుత పులులు ఎలా తిరుగుతున్నాయో చుడండి.

శ్రీశైలం అటవీ ప్రాంతం కావడంతో చిరుత పులుల సంచారం పెరుగుతోంది. చిరుత కనిపించినప్పుడల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అయితే తాము ఎన్నిసార్లు కంప్లెయింట్‌లు ఇచ్చినా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చిరుత వీడియోలు వైరల్ కావడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. అయితే శ్రీశైలంలో మళ్లీ చిరుత కలకలం మొదలైంది. అదిగో చిరుత అంటున్నారు భక్తులు. దీంతో మళ్లీ భయం నెలకొంది. మరోసారి చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. క్షేత్ర పరిధిలోని రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి భక్తులకు కనిపించింది. చిరుతపులిని చూసిన స్దానికులు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సత్రాల పైనుంచి చిరుతపులి కదలికలను వీడియో ద్వారా సెల్ ఫోన్‌లలో చిత్రీకరించారు. అయితే రాత్రుల సమయం కావడంతో చిరుతపులి జనారణ్యంలోకి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రోడ్డుకు దగ్గరలోనే అడివి ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి జనారణ్యంలోకి వచ్చింది.

ఆహారం కొరకు అన్వేషణలో ఉన్నట్లు చెట్ల వద్ద ఏదో కదలడంతో చిరుతపులి శబ్దం కాకుండా నక్కుతూ మాటు వేసినట్లు కనిపించింది. అయితే చిరుతపులిని చూసిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సత్రాలపై నుంచి చిరుతపులిని డైరెక్ట్‌గా చూసి షాక్ అయ్యారు. చిరుతపులిని సెల్‌ఫోన్ ద్వారా వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో శ్రీశైలంలోని స్దానికులు భక్తులు భయాందోళనలకు గురయ్యారు. శ్రీశైలంలో గతంలో కూడా చిరుతపులులు ఔటర్ రింగ్ రోడ్ శివాజీ స్పూర్తి కేంద్రం, రుద్రాపార్క్ సమీపంలో చిరుతలు భక్తులకు కనబడ్డాయి.

అయితే ఆ సమయంలో అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని చిరుతపులిని అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి చిరుత పులి కనిపించడంతో ఆందోళన మొదలైంది. చిరుతపులి కలకలం తేలడంతో శ్రీశైలం దేవస్థానం అధికారులు అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. శ్రీశైలం వచ్చి వేళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని స్దానికులకు భక్తులకు విజ్ఞప్తి చేశారు. చిరుతను బంధించే వరకు అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker