Health

టీ, కాఫీ ఈ రెండిటిలో ఏది తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయాన్నే మొదట టీ లేదా కాఫీ తాగే వ్యక్తులు నిద్రలేవగానే, వారి కడుపులో ఆసిడ్ పిహెచ్ స్కేల్‌లో ఉంటుందని గుర్తుంచుకోవాలి. టీ ఎసిడిక్ ం కాబట్టి, అటువంటి పరిస్థితిలో, మీరు ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు, అది ఎసిడిటీ లేదా గుండెల్లో మంటను కలిగిస్తుంది. అంతే కాదు, ఇది మీ శరీరంలోని జీవక్రియ కార్యకలాపాలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే టీ లేదా కాఫీ. తాగకూడదు. అయితే టీ, కాఫీల ప్రియలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఈ రెండు డ్రింక్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్.

కొందరికి కాఫీ నచ్చితే మరికొంతమందికి టీనే నచ్చుతుంది. కానీ ఆరోగ్య పరంగా ఈ రెండింటిలో ఏది మంచిది. కాఫీ శక్తిని తాగితే తక్షణ ఎనర్జీ వస్తుంది. ఇది మన ఏకాగ్రతను కూడా పెంచుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే కెఫిన్ కంటెంట్ యే ఇందుకు ప్రధాన కారణం. లిమిట్ లో కెఫిన్ ను తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. అభిజ్ఞా పనితీరు బాగుంటుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. కాఫీ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మన కణాలను రక్షించడానికి సహాయపడతాయి.

ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయినప్పటికీ కెఫిన్ ను ఎక్కువగా తీసుకుంటే యాంగ్జైటీ, చంచలత, నిద్రలేమి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఇది కొంతమందిలో కాఫీ హృదయ స్పందన రేటును పెంచుతుంది. రక్తపోటు పెరగడానికి కూడా కారణమవుతుంది. టీ..టీని ఎన్నో ఏండ్ల నుంచి తాగుతున్నారు. టీ.. నీళ్ల తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం. నిజానికి టీ ఎన్నో రుచుల్లో లభిస్తుంది. అందుకే దీన్ని చాలా మంది తాగుతారు. టీ ఆరోగ్యకరమైన పానీయంగా కూడా ఖ్యాతి పొందింది. ఎందుకంటే టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కాఫీ మాదిరిగానే టీలో ఉండే పాలీఫెనాల్స్ కూడా శోథ నిరోధక, క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉన్నాయని నిరూపించబడింది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. టీ వల్ల కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే? దీనిలో కెఫిన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే టీలో థయామిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది శాంతపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే టీ ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. టీలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు కూడా ఉంటాయి.

టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. టీలో ఫ్లేవనాయిడ్లు ఉండటం వల్ల రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే శరీర మంట కూడా తగ్గుతుంది. ఏది ఆరోగ్యకరమైంది..కాఫీ, టీ రెండూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అయినప్పటికీ ఈ రెండింటినీ ఎక్కువగా తాగితే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైనల్ గా ఇది వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించింది. ఏది తాగినా లిమిట్ లో తాగితే ప్రయోజనాలను పొందుతారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker