Health

కాఫీ ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా..?

చలికాలంలో ప్రజలు కాఫీని మరీ ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. అన్నింటి లాగే కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ కాఫీ అధిక వినియోగం పలు రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, శరీరానికి హాని కలిగించకుండా రోజుకు ఎంత కాఫీ తాగాలి అనే విషయాన్ని తెలుసుకోవటం ముఖ్యం. అయితే కాఫీ తాగితే ఎలాంటి తలనొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. అదొక స్ట్రెస్‌ రిలీఫ్‌ డ్రింక్‌గా మారిపోయింది. పనికి కాస్త బ్రేక్‌ ఇచ్చి టీ, కాఫీలు తాగితే మళ్లీ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది.

రోజూ కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎన్ని కప్పులు తాగుతున్నారన్నది మ్యాటర్‌. రోజుకు ఒక కప్పు ఓకే.. అతిగా కాఫీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే కెఫిన్‌ అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి కాఫీ తాగడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల బీపీ రెట్టింపు అయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

అంతేకాకుండా గుండె జబ్బుకు దారి తీసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాఫీ శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది. కానీ అతిగా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీని కారణంగా గ్యాస్ట్రిక్ హార్మోన్ల సంఖ్యను కూడా పెంచే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో సులభంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా రావచ్చు. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఎక్కువగా కాఫీ తాగడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

నిద్రలేకపోవడం కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారి తీస్తుంది. కాఫీని అతిగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పటికే గ్యాస్‌ సమస్యలతో బాధఫడేవారు కాఫీని అతిగా తీసుకోవడం తగ్గించండి. కాఫీలో ఉండే కెఫిన్ కొంతమందిలో ఎముకలపై ప్రభావం చూపుతుంది. శరీరంలోని ఎముకలు బలహీనపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒత్తిడి ఎక్కువగా ఉందని కాఫీ తాగుతుంటారు. కానీ అతిగా కాఫీ తాగితే ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. ప్రతి రోజు కాఫీని తాగడం వల్ల హృదయ స్పందన రేటు పెరిగి ఆందోళన వంటి సమస్యకు కూడా దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker