Health

మీ దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

దాంపత్య జీవితం సుఖంగా ఉండాలి అనుకునే వారు కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి. భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే వారు బెడ్రూంలో కొన్ని వస్తువులను నిరోధించాలి. బెడ్రూంలో దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవడం మంచిది కాదు. అయితే మీకు, మీ భాగస్వామికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకునేలా ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. లేదంటే ఇద్దరి మధ్య సంబంధాలు రోజురోజుకీ క్షీణిస్తాయి. కొన్నిసార్లు ఇవి మరింత ముదిరిపోయే అవకాశం ఉంది. దీని ప్రభావం ఇద్దరి పైనే కాదు… కుటుంబం, పిల్లలపైనా పడుతుంది.

ఇలాంటివి ఎదురైనప్పుడు మీరు కొన్ని పద్ధతులు పాటిస్తే ఇద్దరూ సులభంగా కలిసిపోవచ్చు. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు..అన్ని విషయాలపై దంపతులు ఇద్దరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. ఇద్దరిలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుటివారితో చర్చించాలి. ఇలాంటి ఓపెన్ కమ్యూనికేషన్ ఎప్పటికీ ఉంటే, మీ మధ్య బంధాలు బలోపేతమవుతాయి. ఆరోగ్యకరమైన సంబంధ, బాంధవ్యాలకు ఓపెన్ కమ్యూనికేషన్ మొదటి అస్త్రం అని చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడకుండా బాధపడుతూ కూర్చుంటే ఇంకా కుంగిపోతారు తప్ప ప్రయోజనం ఉండదు.

పనిభారాన్ని పంచుకోండి.. రోజువారీ పని ఒత్తిళ్లు కూడా ఇద్దరి మధ్య గొడవలకు కారణం కావచ్చు. ఇంట్లో ఇలాంటి పనిభారాన్ని మీ భాగస్వామితో పంచుకోవడం ఎంతో అవసరం. భాగస్వామిపై పని ఒత్తిడిని తగ్గించడానికి ఇంటి పనులను ఇద్దరూ కలిసి విభజించుకోవాలి. ఎదుటివారి బాధ్యతలను అర్థం చేసుకునే ఇలాంటి ప్రయత్నాల వల్ల మీ సంబంధం బలపడుతుంది. అందుకే దంపతులిద్దరూ కలిసి పనులు చక్కబెట్టుకునేలా చూసుకోవాలి. ఎదుటివారిని అభినందించాలి.. దాంపత్య జీవితం సజావుగా సాగేందుకు ఈ చిట్కా ఎంతగానో తోడ్పడుతుంది.

మీ భాగస్వామి ప్రయత్నాలను మీరు గుర్తించి, అభినందిస్తే… వారి మనసులో సానుకూల దృక్పథం అభివృద్ధి చెందుతుంది. దీంతో వారి మనసుకు మరింత దగ్గరవుతారు. కృతజ్ఞతా భావాన్ని చూపించే ఇలాంటి చిన్న చిన్న విషయాలే భాగస్వామిని మీకు మరింత చేరువ చేస్తాయి. సాన్నిహిత్యం ముఖ్యం.. దంపతులిద్దరి మధ్య వివిధ అంశాల్లో సాన్నిహిత్యం ఉండాలి. శారీరకంగా, మానసికంగా మాత్రమే కాదు… భావోద్వేగాల పరంగా, ఆధ్యాత్మికంగా కూడా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండాలి. సాన్నిహిత్యం అనేది ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో, ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతోనే ఏర్పడుతుంది.

ఇందుకు కొంత సమయం పట్టవచ్చు. అందుకే దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ఓపికతో ఎదుటివారిని అర్థం చేసుకోవాలి. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకునే అలవాట్లు మానుకోవాలి. విలువలను పంచుకోండి.. మీ భాగస్వామికి అన్ని విషయాల్లో విలువ ఇవ్వండి. విలువలను పంచుకోవడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఒకే రకమైన రిలేషన్షిప్ గోల్స్ ఉండటం, ఒకే భావజాలాన్ని (ఐడియాలజీ) పంచుకోవడం అనేవి దీర్ఘకాలంలో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మంచి మార్గాలుగా ఉపయోగపడతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker