మీ భర్త ఆ విషయంలో బాగా రాణించాలంటే భార్య ఏం చెయ్యాలో తెలుసుకొండి.
మీరు మీ జీవితంలో చాలా సంవత్సరాలు గడిపిన ఇంటిని, మీ కుటుంబాన్ని విడిచిపెట్టడం అంత సులభం కాదు. అటువంటి పరిస్థితిలో కొత్త కుటుంబానికి వెళ్లడం, వారి మార్గాలు నేర్చుకోవడం, అందరితో సర్దుబాటు చేయడం కొంచెం కష్టం. అందుకే తమ భాగస్వామిని తమ ఇంట్లో సుఖంగా ఉండేలా చూడడం, వారికి సర్దుకుపోవడానికి ప్రయత్నించడం అబ్బాయిల బాధ్యత అవుతుంది. అయితే కొన్నిసార్లు భర్త దృష్టిలో పడాలని భార్య చాలా ప్రయత్నిస్తుంది. అతడేదో పనిలో ఉండి గమనించకపోవచ్చు. అంతమాత్రన బాధపడాల్సిన అవసరం లేదు. మీరు అతని దృష్టిలో పడేందుకు కొన్ని ప్రయత్నాలు చేయాలి.
కొన్ని విషయాలను ప్రయత్నించడం వలన అతను కచ్చితంగా మీతో సన్నిహిత క్షణాలను పంచుకునేందుకు రెడీ అవుతాడు. మీ భర్త సెక్స్ కోసం మూడ్‌లోకి రానప్పుడు.. ఎందుకు మూడ్‌లో లేడో అర్థం చేసుకోవడం ముఖ్యం. మీరు కారణాలను కనుగొనగలిగితే, మీ భర్తను బెడ్ మీదకు తీసుకురావచ్చు. దీంతో శారీరకంగా అతనిని ఆకర్షించడం మీకు చాలా సులభం అవుతుంది. బెడ్‌లో మీ భర్త దృష్టిని ఆకర్షించడానికి సులభమైన మార్గాలలో ఒకటి సెక్స్‌ను ముందు మీరే ప్రారంభించడం. ప్రతీసారి.. అతడే వచ్చి.. శృంగారంలోకి దింపాలంటే కుదరదు.
కొన్నిసార్లు మీరు కూడా చనువు తీసుకోవాలి. ఎల్లప్పుడూ అతడే ముందుకు వస్తే.. కొన్నిసార్లు విసుగుతో కూడా ఉంటాడు. మీ భాగస్వామి శారీరకంగా సన్నిహితంగా ఉండటానికి ఆకర్శించాలి. దీంతో అతడి మనసులో ఉన్న టెన్షన్స్ కూడా పోతాయి. కొన్నిసార్లు మీ భాగస్వామికి రిలాక్సింగ్‍గా మసాజ్ చేయడం మంచిది. మసాజ్ అతడి మానసిక స్థితిని చాలా మార్చేస్తుంది. అయితే మసాజ్ చేస్తున్నాం కదా అని పాత దుస్తులే వేసుకోకండి. ఆకర్శించే దుస్తులు ధరించి.. మసాజ్ చేయండి. మీ భర్త మీ నుండి ఒక రకమైన ఆకర్షణను అనుభవిస్తాడు.
మసాజ్ చేసే సమయంలో మీ పాదాలను ఉపయోగించవచ్చు, అతని చెవిలో గుసగుసలు చెప్పవచ్చు. మీ భాగస్వామిని లైంగికంగా ప్రేరేపించడానికి మరొక సులభమైన మార్గం.. మీ ఇద్దరి మధ్య లైంగిక సంభాషణ రావడం. అతడి చెవి దగ్గర శబ్దం చేయండి, చెవిలో ఏదైనా గుసగుసలాడుకోండి. మంచంలో అతని నుండి మీరు ఏం ఆశిస్తున్నారో, అతను మీ నుండి ఏమి ఆశించవచ్చో తెలియజేయండి. ఒకవేళ నేరుగా మాట్లాడటం సిగ్గు అనిపిస్తే.. మీకు కావాల్సింది.. అతడి ఫోన్ కు మెసేజ్ పంపండి. కాస్త రొమాంటిక్‍గా ఉంటుంది. పురుషులకు నేత్రానందమే ఎక్కువ.
మీరు రోజూ అదే దుస్తులు ధరించినట్లయితే, ప్రతిరోజూ అదే విధంగా ఉంటాడు. అతనికి కొత్తగా ఏమీ కనిపించదు. కొన్నిసార్లు మీ అందాలను హైలైట్ చేసే బాడీ హగ్గింగ్, వదులుగా ఉండే దుస్తులకు వేసుకోండి. కొంచెం లైట్ మేకప్ వేసుకుని గ్లామరస్ గా కనిపించండి. ఇలా చేస్తే మీ భర్త కింద నుంచి మీది వరకూ మిమ్మల్సి స్కానింగ్ చేసి మూడ్‍లోకి వచ్చేస్తాడు. మీతో పడకగదిలో చక్కగా ఆడుకుంటాడు. అయితే కేవలం బెడ్ రూమ్‍లోనే కాదు.. బాత్ రూమ్‍లోనూ అతడిని మీరు రెచ్చగొట్టొచ్చు. కలిసి స్నానం చేసేలా అతడిని ప్రోత్సహించండి. ఇది మెల్లమెల్లగా చక్కటి రొమాన్స్ అవుతుంది. ఇది చివరికి సెక్స్ వరకూ వెళ్తుంది.