Health

రోజూ ఓ గుప్పెడు వేయించిన నల్లల శనగలు తింటే ఎంత మంచిదో తెలుసుకోండి.

ప్రతిరోజు గుప్పెడు శనగలను తినటం ద్వారా చిన్నచిన్న ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శ‌న‌గ‌ల్లో పొటాషియం పుష్క‌లంగా ఉంటుంది. ఒక కప్పు శ‌న‌గ‌ల ద్వారా మ‌న‌కు సుమారుగా 474 మిల్లీగ్రాముల పొటాషియం ల‌భిస్తుంది. పొటాషియం మ‌న శ‌రీరంలో బీపీని నియంత్రిస్తుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. అందువ‌ల్ల నిత్యం శ‌న‌గ‌ల‌ను తింటే హైబీపీ త‌గ్గుతుంది. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

సూపర్ రిచ్ ప్రోటీన్,విటమిన్స్,మినరల్స్,ఫైబర్ పుష్కలంగా వున్నా శనగలతో జీర్ణం కూడా బాగా అవుతుంది. ఇప్పుడంటే అనేక రకాల స్నాక్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వచ్చాయి కానీ.. ఒకప్పుడైతే మాత్రం వేరు శనగలు, వేయించిన శనగలు, ఉడక బెట్టిన శనగలు, పెసలు, బొబ్బర్లు లాంటివి ఇంట్లోనే ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకుని తినేవాళ్లు. పూర్వం అవే స్నాక్స్. ఖాళీ సమయాల్లో నోట్లో అలా ఒక్కొక్కొటి వేసుకుని తినేవారు.

ఇవి ఆరోగ్యానికి కూడా చాలా హెల్దీ అన్న విషయం చాలా మందికి తెలీదు. వీటిల్లో విటమిన్స్, ఫైబర్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఎక్కువగా ఇవి పార్కుల వద్ద రోడ్ కనిపిస్తూ ఉంటాయి. రోజూ కాసిన్ని వేయించిన శనగలను తినడం వల్ల అరుగుదల శక్తితో పాటు ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు. ఇంకా వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇమ్యూనిటీ లభిస్తుంది.. రోజూ ఓ గుప్పెడు వేయించిన నల్ల శనగలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతంది.

దీంతో సీజనల్ అనారోగ్య సమస్యలు, ఇతర వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. జీర్ణ సమస్యలు ఉండవు.. తరచూ వేయించిన శనగలు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. దీంతో మల బద్ధకం ప్రాబ్లమ్ కూడా ఉండదు. బరువు నియంత్రణలో ఉంటుంది.. వేయించిన నల్ల శనగల్లో ఫైబర్ కంటెంట్, పీచు పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇవి ఓ గుప్పెడు తింటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఇవి తిన్న వెంటనే ఏ ఆహారం తీసుకోలేము.

రక్త హీనత ఉండదు..క్రమం తప్పకుండా తరచూ శనగలు తినడం వల్ల రక్త హీనత సమస్య ఉండదు. ఎందుకంటే వీటిల్లో ఐరన్ ఉంటుంది. దీంతో రక్త హీనత సమస్యలు రావు.. వచ్చినా వీటిని తింటే అదుపులోకి వస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. శనగల్లో ప్రోటీన్లు, ఫోలేట్, మెగ్నీషియం అనేవి ఉంటాయి. ఇవి గుండె పని తీరును మెరుగు పరుస్తాయి. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker