Health

రోజు పరగడుపున మూడు ఖర్జూరాలు తింటే.. బయటకి చెప్పలేని రోగాలన్నీ తగ్గిపోతాయి.

ఖర్జూరం తింటే, అందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి శరీరానికి మంచిదే. కానీ ఖర్జూరాలను అధికంగా తీసుకోవడం మాత్రం కొందరికి మంచిది కాదు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఖర్జూరం తీసుకోవడం మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. డయాబెటిస్ ఉన్నవారికి సాధారణంగా రక్తంలో చక్కెర ఎక్కువ ఉంటుంది, అధిక కేలరీల స్థాయిలు ఉంటాయి. అటువంటివారు ఎక్కువ ఖర్జూరాలు తీసుకుంటే, అవి రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి.

అప్పుడు వారికి ఖర్జూరం హానికరం కావచ్చు. అయితే ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. దీనితో పాటు శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. గుండె దృఢంగా ఉండాలంటే ప్రతిరోజూ ఖర్జూరం తినడం చాలా అవసరం. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చలికాలంలో ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పులతో బాధపడే మహిళలు తప్పనిసరిగా ప్రతిరోజూ ఖర్జూరం తినాలి.

ఎండిన ఖర్జూరంలో పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉంటాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల కలిగే ఇతర లాభాలు ఇవే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఖర్జూరం తినడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే.. ముందుగా వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టడం.

నానబెట్టిన ఖర్జూరాలను ఉదయం ఖాళీ కడుపుతో సులభంగా తినవచ్చు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్, పీచు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ కె, సోడియం అధికంగా లభిస్తాయి. ఖర్జూరం తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఖర్జూరం తినడం శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించవచ్చు. దీన్ని తినడం వల్ల ఎముకలు కూడా బలపడతాయి.

ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల కంటి, కడుపు సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, అల్జీమర్స్, పలు రకాల క్యాన్సర్ల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఖర్జూరం తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఇందులో ఉండే విటమిన్ కె రక్తం చిక్కబడకుండా చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker