Health

ఈ చలికాలంలో రోజూ టీస్పూన్ నెయ్యి తింటే చాలు, మీకున్న ఆ సమస్యలన్నీ తగ్గిపోతయ్.

వెన్న‌ను క‌రిగించ‌గా వ‌చ్చే ఈ నెయ్యి లేనిదే చాలా మంది భోజ‌నం చేయ‌రు. నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అనేక ర‌కాల పోష‌కాలు అందుతాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, శ‌రీరానికి బ‌లాన్ని చేకూర్చ‌డంలో నెయ్యి మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆయుర్వేదంలో కూడా నెయ్యిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. అయితే చలికాలంలో మన ఆరోగ్యం ఎంతో ప్రభావితం అవుతుంది. ఇతర కాలాలతో పోలిస్తే ఈ కాలంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలు సోకుతుంటాయి.

ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆస్తమా, గ్యాస్, అజీర్ణం వంటి ఎన్నో రకాల సమస్యలు చలికాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. ఇక వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది ఈ సీజన్ లో యాంటీ బయాటిక్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవి మన శరీరానికి అంత మంచివి కాదు. అయితే ఈ యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత నీళ్లను ఎక్కువగా తాగాలి. కానీ ముందే చలికాలం. ఈ సీజన్ లో నీళ్లను పుష్కలంగా తాగే వారు చాలా తక్కువ. అందుకే వీటిని ఉపయోగించకూడదని నిపుణులు చెప్తారు. అయితే మన దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు.

అలాగే అనారోగ్య సమస్యలను తొందరగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే నెయ్యిని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా నెయ్యి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వేడివేడి అన్నంలో నెయ్యిని వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ నెయ్యిని తింటే శరీరానికి ఎంతో మంచిది. అయితే దుకాణాల్లో దొరికే నెయ్యిని కల్తీ చేస్తున్నారు. కాబట్టి ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుని తినడం మంచిది.

మనలో చాలా మంది నెయ్యిని తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు.అందుకే దీన్ని పక్కన పెట్టేస్తుంటారు. నిజానికి నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మన కడుపును తొందరగా నింపుతాయి. ఫలితంగా మీరు అతిగా తినలేరు. దీంతో మీ బరువు కూడా అదుపులో ఉంటుంది. నెయ్యి జీర్ణం కావడం కష్టమని చాలా మంది అంటూ ఉంటారు. అందుకే నెయ్యితో చేసిన ఆహారాలను పక్కన పెట్టేస్తుంటారు. అయితేు ప్రతిరోజూ ఒక చెంచా నెయ్యిని తింటే జీర్ణవ్యవస్థకు మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మలబద్ధకం ఉన్నవారు రోజూ నెయ్యిని తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి బయటపడతారు. మలబద్దకం సమస్య ఉండనే ఉండదు. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీర శక్తిని పెంచుతుంది. అలాగే మన రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఎముకలు లేదా కీళ్ల నొప్పులకు కూడా నెయ్యి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker