Health

డార్క్ చాక్లెట్లు తింటే నిజంగానే ఆ కోరికలు పెరుగుతాయా..?

చాక్లెట్స్ తీయగా, టేస్టీగా ఉంటాయి. నిజానికి చాక్లెట్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా స్వచ్ఛమైన డార్క్ చాక్లెట్ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరుల్లో ఇవీ ఒకటి. అయితే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడటంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నిపుణులు ప్రకారం.. డార్క్ చాక్లెట్లు సెక్స్ డ్రైవ్ కు కూడా ఎంతో సహాయపడతాయి.

ఇవి లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాక్లెట్ లో లైంగిక పనితీరును, కోరికలను పెంచే ఎన్నో సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలో ఫెనిలేథైలామైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులోని ఫీల్ గుడ్ హార్మోన్ అయిన డోపామైన్ ఉత్పత్తి కావడానికి సహాయపడుతుంది. ఇది ఆనందం, ఉద్వేగం భావాలను పెంచుతుంది. డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు.

ఈ ఫ్లేవనాయిడ్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడానికి, శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి లైంగిక పనితీరుపై సానుకూల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడతుతుంది. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను క్రమం తప్పకుండా తినడం వల్ల పురుషులు, మహిళల్లో లైంగిక పనితీరు పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్ లో లిబిడో, లైంగిక పనితీరును మెరుగుపరిచే ఎన్నో సమ్మేళనాలు ఉన్నాయి.

దీనిలో ఉండే ఫెనిలేథైలామైన్ డోపామైన్ ను రిలీజ్ చేస్తుంది. అలాగే సెక్స్ కోరికలను పెంచుతుంది. డార్క్ చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్లు జననేంద్రియ ప్రాంతానికి రక్తప్రవాహాన్ని పెంచుతాయి. దీంతో ఉద్వేగం పెరుగుతుంది. అలాగే లైంగిక పనితీరు మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్ లో అర్జినిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న పురుషులకు ఇది మంచి మేలు చేస్తుంది.

ఎందుకంటే ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అంతేకాక డార్క్ చాక్లెట్ ఒత్తిడి, ఆందోళన స్థాయిలను కూడా తగ్గిస్తుంది.ఇది లైంగిక పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు సెక్స్ కోరికలు కలగవు. అయితే ఈ ఒత్తిడి తగ్గితే లైంగిక కార్యకలాపాల సమయంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతారని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ ఒక సహజ కామోద్దీపన. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆనందం, శ్రేయస్సుతో ముడిపడి ఉన్న హార్మోన్. ఇది భాగస్వాములిద్దరికీ మరింత సానుకూల, ఆహ్లాదకరమైన లైంగిక అనుభవానికి దారితీస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker