Health

ఖర్జూర కల్లు ఒక్కసారి తాగితే ఈ రోగాలన్నీ పోతాయి. లీటర్ ఎంతో తెలుసా..?

కల్లు ఖర్జురం చెట్ల మీద నుంచి దించకుండానే అడ్వాన్స్ ఇచ్చేటంత డిమాండ్ సొంతం చేసుకుంది. ఈ కల్లు కోసం పేద ధనిక, చదువు తో సంబంధం లేకుండా ఎగబడుతున్నారు. లీటర్ రూ. 500 ఖరీదైన సరే సొంతం చేసుకుని తాగడానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ ఖర్జూర కల్లు గురించి తెలిసిన వారు ఎవరైనా తాగకుండా ఉండలేరు అంటున్నారు. అయితే కొందరు రైతులు కర్జూ చెట్లను సాగు చేస్తున్నారు.

ఆ చెట్ల నుంచి కల్లు తీస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ కల్లు ఆరోగ్యంతో పాటు, ఆదాయాన్ని ఇస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఖర్జూర కల్లుకు ఉందని అంటున్నారు కల్లు ప్రియులు. సాథారణంగా తాటికల్లు, ఈతకల్లు చేదుగా, పుల్లగా, కొన్ని సార్లు తియ్యగా, వంగరుగా కూడా ఉంటుంది.

కానీ ఖర్జూర కల్లు మాత్రం తియ్యగా, రుచిగా ఉంటుందని అందరూ తాగడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవాపూర్ కర్జూర కల్లుకు ఒక బ్రాండ్‌గా మారింది. ఖర్జూర కల్లు తాగేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు హైదరాబాద్ వాసులు కూడా తరలివెళుతున్నారు. ఖర్జూర కల్లు టేస్ట్‌ని ఆస్వాదిస్తున్నారు.

ఉదయాన్నే ఈ కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని, అద్భుతంగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు. తాటి చెట్టు, ఈత చెట్టు అయితే సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే కల్లుని ఇస్తాయి. అదే ఖర్జూర చెట్లు అయితే ఏడాది మొత్తం కల్లుని ఇస్తాయి. ఒక్కో చెట్టు నుంచి రోజుకు 20 లీటర్ల కల్లు వస్తుంది. లీటర్ వంద రూపాయలకు విక్రయిస్తున్నారు.

కర్జూర కల్లు తాగేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నా చెట్లు తక్కువగా ఉండడంతో సరిపడా కల్లు ఉత్పత్తి చేయలేకపోతున్నామని కల్లు విక్రయదారులు వాపోతున్నారు. ప్రభుత్వం సహకరించి కర్జూర చెట్లను పెంచి తమకు ఉపాధి కల్పించాలని గీత కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ప్రజలకు ఆరోగ్యవంతమైన కర్జూర కల్లును అందిస్తామని అంటున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker