చనిపోయిన వ్యక్తుల దుస్తులు వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?
మరణం తరువాత, శరీరం మాత్రమే నశిస్తుంది, కానీ వ్యక్తి ఆత్మ అమరత్వం గా ఉంటుందట. అది ఎప్పటికీ చావదు. ఏవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు. ఆప్యాయత, ప్రేమ కారణంగా, కుటుంబ సభ్యులు తమ వద్ద ఉన్న కొన్ని విషయాలను జ్ఞాపకాలుగా ఉంచుకుంటారు. వీరిలో చనిపోయిన వారి బట్టలను ఉంచి వాటిని వాడే వారు కూడా ఉన్నారు. చాలా మంది ఈ వస్తువులను పేదలకు అందజేస్తున్నారు.
అయితే గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల దుస్తులను.. పొరపాటున కూడా వేరే వాళ్లు ధరించకూడదు. ఎందుకంటే మరణం తర్వాత కూడా వాళ్ల వస్తువులపై ఆత్మ అనేది ముడి పడి ఉంటుంది. దీంతో మీ పై ఆత్మ ఆకర్షణ పెరుగుతుంది. నిజానికి మృతుడి ఆత్మ తన కుటుంబాన్ని విడిచి వెళ్లడానికి అస్సలు ఇష్టపడదు.
వారి చుట్టూనే తిరుగుతుందని గరుడ పురాణం చెబుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన వారి వస్తువులను మన దగ్గర ఉంచుకోవడం ద్వారా ఆత్మ మనతో ముడి పడి ఉంటుంది. అంతే కాకుండా చనిపోయిన వ్యక్తి ఆత్మ.. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య తిరుగుతూ వేధిస్తుంది. అందుకే మరణించిన వ్యక్తి వస్తువులను దానం చేయాలని గరుడ పురాణం అంటోంది.
దీని వల్ల తీసుకున్నవారికి కూడా ఎలాంటి నష్టం ఉండదు. మరణించిన వ్యక్తి ఆత్మ.. సులభంగా ఇంటిని విడిచి పెట్టి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ సమయంలో మరణించిన వ్యక్తులు దుస్తులు ధరిస్తే.. సమస్యలు రావడం మొదలవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం.