దీప్తి సునయనకి యాక్సిడెంట్, అసలు ఏం జరిగిందంటే..?

యూ ట్యూబ్ వీడియో లతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతూ ఉంది. అయితే తాజాగా సోషల్ మీడియా లో ఈ దీప్తి గురించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. దీప్తి సినిమాకు రోడ్డు ప్రమాదం జరిగిందని చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్త విన్న దీప్తి సునైన మొదట బాధపడినా , ఆ తర్వాత ఈ ఫేక్ వార్తకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుని… క్లారిటీ ఇచ్చింది. అయితే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో ఆ వార్తలు నిజం కాదని తేలింది.
అయితే ఈరోజు ఒక ఫాలోవర్ ఆమె దృష్టికి ఈ విషయం తీసుకు వెళ్లడంతో ఆమె ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, ఆమె చెప్పుకొచ్చింది. ఇలా వార్తలు రావాడనికి ముఖ్య కారణం ఒక వీడియో అని, అందులో తనకు యాక్సిడెంట్ అవుతున్నట్టు ఉంటుందని చెప్పుకొచ్చింది.
అయితే అది నిజమైన యాక్సిడెంట్ కాదని పేర్కొన్న ఆమె సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం అలియా ఖాన్ అనే షార్ట్ ఫిలిం చేశానని, అందులోని క్లిప్ ను ఇలా తనకు యాక్సిడెంట్ అయిందని వార్తలు సృష్టించేందుకు వాడుతున్నరని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు తనకు ఏమీ కాలేదని ప్రస్తతానికి తాను చాలా బాగున్నానని కూడా ఆమె అన్నారు. సో ఆమెకు యాక్సిడెంట్ అయిందంటూ వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవమే అన్నమాట.
షార్ట్ ఫిలిమ్స్. రీల్స్, టిక్ టాక్ అని దేన్నీ వదలకుండా ఆమె అందివచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటూ పోయింది. ఈ క్రమంలో ఏకంగా నాగార్జున హూస్ట్‌గా నిర్వహించే బిగ్‌బాస్‌లో కూడా అవకాశం రావడంతో దశ తిరిగింది. అయితే ఆ హౌస్ నుంచి బయటకు వచ్చాక షణ్ముఖ్ జశ్వంత్‌తో ఉన్న ప్రేమ బయట పడడం మనోడు బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఆ బంధానికి బీటలు వారడం అనే విషయాలు అందరికీ తెలిసిందే.
ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ కొంత డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డ ఆమెకు యాక్సిడెంట్ అయింది అంటూ యూట్యూబ్ లో వార్తలు రావడం మొదలయ్యాయి.